Sunday, 11 July 2021

Valimai Motion Poster : కాస్త ఆలస్యమే అయినా.. తలా అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

తలా అభిమానులు ప్రస్తుతం ఆనందంలో ఉన్నారు. గత రెండేళ్ల నుంచి సరైన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నేర్కొండ పార్వై సినిమా తరువాత మళ్లీ ఇంత వరకు అజిత్ తెరపై కనిపించలేదు. షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా కూడా కరోనా వల్ల ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. అలా వలిమై కోసం కోలీవుడ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అప్డేట్ ఇవ్వండి అంటూ దర్శక నిర్మాతలైన హెచ్ వినోద్, బోనీ కపూర్‌లను ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. అయితే అజిత్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. కానీ మే నెలలో కరోనా ఉధృతంగా ఉండటం, పరిస్థితులు బాగా లేకపోవడంతో అప్డేట్‌ను క్యాన్సిల్ చేశారు. అలా ప్రతీ సారి ఏదో అడ్డంకి వచ్చింది. కానీ అభిమానుల కోరిక మాత్రం నెరవేరలేదు. కానీ మొత్తానికి వారి కలలు నెరవేరాయి. నేటి మధ్యాహ్నం నుంచి వలిమై అప్డేట్ గురించి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూనే వచ్చింది. వలిమైలో విలన్‌గా నటించిన హీరో కార్తికేయ అసలు గుట్టు విప్పేశారు. సాయంత్రం ఆరు గంటలకు సర్ ప్రైజ్ అంటూ ట్వీట్ వేయడంతో అప్డేట్ విషయం బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తలా ఫ్యాన్స్ ట్విట్టర్‌లో మోత మోగిస్తున్నారు. అయితే చెప్పిన సమయం కంటే నాలుగు నిమిషాలు ఆలస్యం అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు అసహానికి గురి అయ్యారు. కానీ వారి ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఆ అప్డేట్ ఉండటంతో శాంతించారు. రేసర్‌గా తలా అదిరిపోయారు. ఫస్ట్ లుక్ మొత్తానికి తలా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బోనీ కపూర్ నిర్మిస్తోన్న ఈ మూవీని హెచ్ వినోద్ తెరకెక్కించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hWP6cv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...