Monday, 19 July 2021

మళ్లీ దొరికిన రంగమ్మత్త.. కొత్త పదమా?.. అనసూయను ఆడుకుంటోన్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యే సెలెబ్రిటీల్లో మొదటి స్థానంలో ఉంటారు. అనసూయ ఫోటోలు షేర్ చేసినా, పోస్ట్ చేసినా కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటుంది. ఎప్పుడూ కూడా అనసూయ వస్త్రాధారణ మీద అందరి దృష్టి ఉంటుంది. ఇక అది కాకుండా అప్పుడప్పుడు కొత్త పదాలను కనిపెడుతుంటారు కొంతమంది. మంచు లక్ష్మీ నిలదిస్‌ఫై ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఆ మధ్య అనసూయ కూడా కొత్త పదాన్ని కనిపెట్టేశారు. గెలికిఫై అంటూ తన స్టైల్లో అనసూయ కొత్త పదాన్ని పుట్టించారు. అప్పుడు ఆ మాటలు, వీడియోలు ఎంతటి ట్రోలింగ్‌ను ఎదుర్కున్నాయో అందరికీ తెలిసిందే. అలాంటి అనసూయ తాజాగా మళ్లీ దొరికారు. ఆమె చేసిన ఓ పోస్ట్‌ మీద నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అనుకోకుండా పొరపాటు జరిగి ఉంటుందేమో. స్పెల్లింగ్ మిస్టేక్ వల్లే ఈ తప్పు జరిగి ఉంటుందేమో. కానీ నెటిజన్లు మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సోమవారం గురించి చెబుతూ.. మండే అనేది స్టేట్ ఆఫ్ మైండ్ అని.. పాజిటివ్ ప్యాంట్స్ (positive pants) మీద దృష్టి పెట్టండి.. స్టఫ్ తెచ్చుకోండి.. అని ఇలా తన స్టైల్లో చెప్పేశారు. అయితే పాజిటివ్ ప్యాంట్స్ ఏంటి.. పాజిటివ్ పాయింట్ (positive points)అయి ఉంటుందిలే అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. పాజిటివ్ ప్యాంట్లు, నెగెటివ్ లో దుస్తులు కూడా ఉంటాయా? అని కౌంటర్లు వేస్తున్నారు. ఇలా మొత్తానికి అనసూయ తెలియకుండా చేసిన స్పెల్లింగ్ మిస్టేక్‌తో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇక ఇప్పుడు అనసూయ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించేస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3exDDPM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...