Monday, 19 July 2021

RAPO 19: రామ్‌తో పోటాపోటీగా ఆది పినిశెట్టి.. భారీ రేంజ్ స్కెచ్చేసి విలన్‌ని ఫిక్స్ చేసిన మేకర్స్

రామ్ పోతినేని హీరోగా రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ 'RAPO19'లో విలన్‌గా ఆది పినిశెట్టిని కన్ఫర్మ్ చేసింది చిత్రయూనిట్. హీరోనా, విలనా, సపోర్టింగ్ క్యారెక్టరా అని చూడకుండా మంచి పాత్రల్లో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా సరే అస్సలు వదలని రామ్‌తో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన లుక్ పోస్ట్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 12న హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు నెలకొనేలా చేయడంలో విజయవంతమైన దర్శక నిర్మాతలు, ఇప్పుడు రామ్ పోతినేనిని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టిని ఎంపిక చేసి సినిమాపై హైప్ పెంచేశారు. గతంలో 'సరైనోడు' సినిమాలో సూపర్ స్టైలిష్ విలన్‌గా ఆది పినిశెట్టి అద్భుతంగా నటించారు. 'రంగస్థలం', 'నిన్ను కోరి', 'యు-టర్న్' సినిమాల్లో మంచి పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. రెగ్యులర్ పాత్రల్లో నటించడం తనకు ఆసక్తి ఉండదని, ఎప్పుడూ కొత్తదనం వెతుకుతుంటానని ఆది పినిశెట్టి ఎప్పుడూ చెబుతుంటారు. ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది కూడా. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ఆయన తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. ఊర మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రామ్, ఆది పినిశెట్టి మధ్య సన్నివేశాలు నువ్వా - నేనా అన్నట్టుగా ఉండబోతున్నాయట. రామ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌ కేటాయించి హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BivFDK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...