Monday, 19 July 2021

తమిళ మాస్ హీరోతో.. తెలుగు మాస్ డైరెక్టర్ కొత్త సినిమా.. ఇక రచ్చ రచ్చే

మాస్ యాక్షన్‌తో, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేసే సెంటిమెంట్‌తో, ఉర్రుతలూగించే ఫైట్లు, పాటలతో సినిమాలు తీయడంలో దర్శకుడు దిట్టా. ఆయన ఇప్పటివరకూ తీసిన సినిమాలు అన్ని ఇవే ధోరణిలో ఉంటాయి. ఆరంభంలో వచ్చిన సినిమాలు సూపర్‌హిట్ కావడంతో అదే ఫార్ములాని నమ్ముకొని సినిమాలు తీస్తూ పోరారు బోయపాటి. అయితే ఆ తర్వాత మాత్రం ఆయన్ని వరుసగా ఫ్లాపులు పలకరించాయి. అయినప్పటికీ.. ఆయన తన స్టైల్‌ని మాత్రం మార్చుకోవడం లేదు. అదే మాస్, అదే యాక్షన్ అంటూ సినిమాలు రూపొందిస్తున్నారు ఆయన. ఇక అలాంటి మాస్ డైరెక్టర్ చేతిలో అంతకు మించిన మాస్ హీరో పడితే.. అది తమిళ హీరో అయితే.. ఆ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు త్వరలో అదే కాంబినేషన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఇప్పుడు సోషల్‌మీడియాలో బలంగా వినిపిస్తోంది. తెలుగు కుర్రాడే అయినప్పటికీ.. మొదటి నుంచి తమిళంలో సెటిల్ కావడంతో అక్కడే హీరోగా గుర్తింపు సాధించాడు విశాల్. అయితే ఆయన సినిమాలు అన్ని తెలుగులో డబ్బింగ్ అయి.. మంచి హిట్లుగా నిలిచాయి. తమిళ్‌లోనే కాదు.. తెలుగులో కూడా ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బోయపాటి శ్రీను.. విశాల్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తెలియడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బోయపాటి.. బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న ‘అఖండ’ సినిమాలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ఆయన మరో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన విశాల్‌తో సినిమా చేయనున్నారట. ఇది కూడా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VWzDBQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...