Monday, 26 July 2021

తిట్టిందా? పొగిడిందా?.. భర్త బర్త్ డేపై నిహారిక.. ముద్దు పేరు మాత్రం హైలెట్!!

మెగా డాటర్ సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంది, ఆట పట్టిస్తుందో అందరికీ తెలిసిందే. జొన్నలగడ్డతో వివాహాం అనంతరం నిహారిక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. భర్తతో కలిసి నిహారిక చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆ మధ్య మాల్దీవులు, మొన్న పాండిచ్చెరి టూర్‌కు సంబంధించిన విశేషాలు నిహారిక షేర్ చేయగా అవి తెగ వైరల్ అయ్యాయి. అయితే నిహారిక తన భర్త బర్త్ డే సందర్భంగా గత ఏడాది చేసిన పోస్ట్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందే ఈ ఇద్దరూ బర్త్ డే పార్టీలు కూడా చేసుకున్నారు. ప్రైవేట్‌గా ఈ ఇద్దరూ పెళ్లి కాక ముందే చక్కర్లు కొట్టేశారు. ఇక ఇప్పుడు ఈ జంట చేస్తోన్న రచ్చకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. నేడు (జూలై 26) చైతన్య బర్త్ డే. ఈ క్రమంలో నిహారిక తన భర్తకు స్పెషల్ విషెస్ అందించారు. అయితే ఈ పోస్ట్‌లో నిహారిక తన భర్తను పొగిడారో? లేదా తిట్టారో కూడా అర్థం కానట్టుంది. ‘హ్యాపీ బర్త్ మొగుడా.. సినిమా సంగతుల్లో నీ వింత సెలక్షన్స్, నీ వంట ఎక్స్‌పరిమెంట్స్, నీ కాఫీ పిచ్చి, అర్దరాత్రి లేచి స్నాక్స్ తినడం, థీమ్ పార్టీలు చేయడంలో నీకున్న అంకిత భావం, నీ సిల్లీ రియాక్షన్స్, సైలెంట్‌గా బుద్దిమంతుడిలా ఉండటం, నీ ఓర్పు ఇలా ఓ భర్తకు కావాల్సిన అద్బుత లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ జీవితానికి నీ లాంటి మంచి వ్యక్తి దొరకడం కంటే ఇంకేం కావాలి. నువ్ నా ప్రేమను కురిపిస్తున్న విధానానికి థ్యాంక్స్. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను.. చేచు’ అని భర్త ముద్దు పేరును కూడా బయటపెట్టేశారు నిహారిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i2RAHf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...