Monday, 26 July 2021

విలన్ ఎంట్రీ కోసం భారీగా బడ్జెట్ కేటాయించిన చిత్ర యూనిట్.. ఖర్చెంతో తెలిస్తే అవాక్కవుతారు.. !

ఇండియాలో అత్యంత క్రేజ్ ఉన్న రెండు పరిశ్రమలు సినిమా, క్రికెట్. ఓ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే.. టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే.. తమ అభిమాన నటుల కోసం ఎంత దూరం వెళ్లడానికైనా వెనుకాడరు. సినిమా చూడటం కోసం ఎన్నిరోజులైనా ఎదురుచూస్తారు. తమ అభిమాన నటుడి సినిమా విడుదల అవుతుందంటే.. ఆ థియేటర్‌ని పెళ్లికూతురిగా ముస్తాబు చేయడమేకాదు.. ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు కూడా చేస్తుంటారు. అన్నిటికన్న ముఖ్యంగా సినిమాలో హీరో ఎంట్రీ సీన్ వస్తుంటంటే వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇదంతా హీరోల విషయంలో.. మరి విలన్ల సంగతి ఏంటీ. చాలా సినిమాల్లో ఏదో వస్తాడు.. పోతాడు అన్నట్లుగా విలన్ పాత్ర ఉంటుంది. ఇంకొన్ని సినిమాల్లో అయితే.. విలన్ పాత్రకి ఏమాత్రం ప్రాముఖ్యత ఉండదు. కానీ, హీరో ఎంట్రీతో సమానంగా విలన్ ఎంట్రీని చిత్రీకరించిన సందర్భాలు మనం గతంలో ఎప్పుడైనా చూశామా అంటే లేదనే చెప్పుకోవాలి. కానీ, ఓ సినిమా యూనిట్ మాత్రం విలన్ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ కండల వీరుడు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘టైగర్-3’. ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ‘టైగర్’ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పటికే వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హే’ అనే సినిమాలు మంచి సక్సెస్‌లు సాధించాయి. ఇప్పుడు తాజాగా ‘టైగర్-3.. ది ఫైనల్ మిషన్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్‌గా ఇమ్రాన్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. ఈ సన్నివేశం కోసం సుమారు రూ.10 కోట్లు ఖర్చుపెట్టనున్నట్టు తెలుస్తోంది. మనీష్‌శర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కత్రినాకైఫ్‌ నాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి విలన్ ఎంట్రీ సీనే హైలైట్‌గా నిలుస్తుందని టాక్ బలంగా వినిపిస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zAaDi7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...