Monday, 26 July 2021

ఎలాంటి వీడియోలు పెట్టాలి?.. మంచు లక్ష్మీ కూడా వదిలేట్టులేదు!

ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ కూడా యూట్యూబ్ మీద పడిపోతోన్నారు. అక్కడ ఆదాయం కూడా మంచిగానే ఉంటుండటంతో సెలెబ్రిటీలందరూ కూడా తమ పేర్లతో కొత్త కొత్త చానెల్‌లను క్రియేట్ చేసుకుంటున్నారు.వెరైటీ వీడియోలతో తమ తమ ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బుల్లితెర తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎక్కువగా యూట్యూబ్‌ను వాడుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొంత మంది వెండితెర నటీమణులు కూడా యూట్యూబ్‌ను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఆ జాబితాలోకి కూడా చేరారు. గత ఏడాదే తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి చిట్టి చిలకమ్మ అనే యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు. మోహన్ బాబు చేతుల మీదుగా ఎంతో గ్రాండ్‌గా ఆ చానెల్ ప్రారంభించిన మంచు లక్ష్మీ పిల్లలకు అవసరమైన వీడియోలను చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మంచు లక్ష్మీ తనకంటూ సపరేట్‌గా ఓ చానెల్ ఉండాలని భావించినట్టు తెలుస్తోంది. ఈ కమ్రంలోను తాను ఓ కొత్త యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించాలనుకున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు ఎలాంటి వీడియోలు పెట్టాలి? మీకు ఎలాంటివి అంటే ఇష్టమని తన ఫాలోవర్లను అడిగారు. ఏమైనా సలహాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.. ప్రతీ ఒక్కటీ నేను చదువుతాను.. మీ సలహాలను పరిగణలోకి తీసుకుంటాను. మీకు నచ్చిన వీడియోను పెడతాను అని చెప్పుకొచ్చారు. మున్ముందు మంచు లక్ష్మీ కూడా వెరైటీ వీడియోలను నెటిజన్లను ఆశ్చర్యపరిచేలానే ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37847CZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...