Tuesday, 27 July 2021

‘ప్రాజెక్ట్ కే’ గురించి మరో ఆసక్తికరమైన వార్త.. ప్రభాస్‌తో నటించనున్న అక్కినేని కోడలు..?

‘ఏం మాయ చేశావే’ సినిమాతో కుందనపు బొమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది . ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు అందుకుంది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఆమె.. తమిళంలో కూడా టాప్ హీరోలతో నటించింది. ఇక అక్కినేని ఫ్యామిలీ ఇంటి కోడలు అయినప్పటి నుంచి ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. తన మొదటి సినిమా హీరో నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రెట్టింపు జోష్‌తో నటిస్తోంది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ‘మజిలీ’, ‘ఓ బేబీ’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న సమంతా. ఆ తర్వాత తమిళంలో సూపర్‌హిట్ సాధించిన సినిమా ‘96’ రీమేక్‌గా రూపొందిన ‘జాను’ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అనే వెబ్‌ సిరీస్‌లో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ పాత్రకిగాను సమంతాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘శాకుంతలం’లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా సమంతా తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. తొలిసారిగా ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోందట. దర్శకత్వంలో ‘’ పేరుతో ఈ మధ్యే సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ దివా దీపికా పదుకొణే హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సమంతాను ఓ ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్ దీనిపై సమంతాతో చర్చలు జరుపగా పాత్ర నచ్చడంతో వెంటనే ఆమె ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BHoyFf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...