Tuesday, 27 July 2021

వర్షిణికి బంపర్ ఆఫర్.. తొలిసారి సమంతతో! సీక్రెట్ రివీల్ చేసిన బ్యూటిఫుల్ యాంకర్

బుల్లితెరపై సందడి చేసి ఫేమస్ అయ్యాక వెండితెరపై వెలిగిపోతున్న తారలను చాలామందినే చూశాం. ముఖ్యంగా నేటితరం బ్యూటిఫుల్ యాంకర్స్ బుల్లితెరపై హంగామా చేస్తూనే సిల్వర్ స్క్రీన్ అవకాశాలు పట్టేస్తున్నారు. అనసూయ, శ్రీముఖి, రష్మీ, ఈ కోవకి చెందిన వారే. అయితే 'ఢీ' షోతో ఓ ఊపు ఊపేసిన వర్షిణి ఆ తర్వాత కామెడీ స్టార్స్ షో ద్వారా ఆకట్టుకుంది. తాజాగా ఆమెకు సమంతతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కిందట. ఈ సీక్రెట్ స్వయంగా ఆమెనే వెల్లడించింది . టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ''లో వర్షిణి కూడా భాగమవుతోందట. అక్కినేని కోడలు ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ మేల్ లీడ్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో తాను కూడా నటిస్తున్నానని చెబుతూ ఓపెన్ అయింది బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి. తాను ఎప్పుడూ స్టార్స్‌తో పని చేయలేదని, తొలిసారి సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది. ఇందులో తన పాత్ర మల్టిపుల్ లుక్‌తో ఉంటుందని, గుణశేఖర్ లాంటి గొప్ప దర్శకుడితో పని చేయడం ఓ అద్భుతమైన అనుభవమని వర్షిణి చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌లో వర్షిణి జాయిన్ అయిందట. దీంతో పాటు సుమంత్ హీరోగా రాబోతున్న మరో సినిమాలోనూ ఆమె నటిస్తోంది. సో.. ఈ పాన్ ఇండియా సినిమాతో వర్షిణి ఫేట్ మారిపోయి ఇకపై వెండితెర బిజీ యాక్టర్ అవుతుందేమో చూడాలి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i6HZiL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...