Saturday, 24 July 2021

షాకిచ్చిన నటి.. అలా చేస్తేనే కుదురుతుందంటూ ఊహించని ట్విస్ట్..

సాధారణంగా హీరోయిన్లపై పలువురు రాజకీయ నాయకుడు వేధింపులకు పాల్పడతారు అనే మాటని మనం వింటూ ఉంటాం. సినిమాల్లో అవకాశాల కోసం వాళ్లని శారీరకంగా తృప్తి పరచాలని వేధిస్తుంటారని చాలాసార్లు విన్నాం. అయితే తాజా తనని శారీరకంగా వేధించాడంటూ.. తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత మణికంఠన్‌పై నటి చాందిని విమర్శలు చేశారు. తనకు రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్తే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి మోసం చేశారని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇంతకు ముందు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో మణికంఠన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది. దీంతో పాటు సైదాపేట కోర్టులో చాందిని మరో కేసు దాఖలు చేశారు. తనకు రూ. 10 కోట్ల పరిహారాన్ని మణికంఠన్ చెల్లించాలని... దీనికి తోడు చెన్నైలో ఉండి కోర్టు వ్యవహారాలను తాను చూసుకోవాలని, అందువల్ల దీనికి అయ్యే నెలవారీ ఖర్చులను కూడా ఆయనే చెల్లించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై ఆగస్ట్ 5న కోర్టు విచారణ చేపట్టనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BycuG6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...