Saturday, 24 July 2021

పాన్ ఇండియా ప్రాజెక్టు మొదలైంది.. క్లాప్‌ కొట్టి ప్రారంభించిన ప్రభాస్

ప్రభాస్.. ఈ పేరు తెలియని భారత సినీ అభిమాని ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అంతకు ముందు వరకూ ఒక రేంజ్‌‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ‘బాహుబలి’ సినిమా తర్వాత ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది. ప్రస్తుతం అతను వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘రాధే శ్యామ్’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాక.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాలో కూడా అతను నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. గురు పూర్ణమను అందరూ ప్రత్యేకంగా భావిస్తారు. దీంతో ఈ ప్రత్యేకమైన రోజున ప్రభాస్ కూడా తన సినిమాను ప్రారంభించాడు. బాలీవుడ్ మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ప్రభాస్.. శనివారం క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ‘ప్రాజెక్ట్ కె’ అంటూ త్వరలో ప్రభాస్ మన ముందుకు రానున్నాడు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ సినిమా ఆరంభం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kSJKSy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...