Saturday, 24 July 2021

బుల్లి నిక్కర్లో సలోని అందాల విందు.. భాను‘మతి’ పోగొట్టేస్తోందిగా!

తెరపై కనిపించే హీరోయిన్లకు, తెర వెనుక ఉండే హీరోయిన్లకు ఎంతో తేడా ఉంటుంది. తెరపై మనకు కనిపించేది కేవలం పాత్ర మాత్రమే. పాత్రకు తగ్గట్టు మారిపోవడమే నటీనటుల పని. అలా తెరపై మోడ్రన్‌గా కనిపించిన వారంతా నిజ జీవితంలోనూ అలానే ఉంటారనుకోవడం పొరబాటే. ఇక తెరపై ఎంతో పద్దతిగా,ట్రెడిషనల్‌గా కనిపించే అమ్మాయి.. తెర వెనుక అలానే ఉంటుందను కోవడం పొరబాటే అవుతుంది. తాజాగా ఓ బ్యూటీ సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. గత ఏడాది నవీన్ చంద్ర హీరోగా వచ్చిన సినిమాలో హీరోయిన్‌గా నటించిన అందరికీ గుర్తుండే ఉంటుంది. అందంతోనే కాదు నటనలోనూఎంతో మెచ్యురిటీని చూపించారు. సలోని దెబ్బకు కుర్రకారు ఫిదా అయ్యారు. చీరకట్టులో ఎంతో పద్దతిగా నటించి మెప్పించారు సలోని. ఇక మోడ్రన్ డ్రెస్సులోనూ కనిపించినా కూడా ఎక్కడా కూడా అందాలను ఆరబోయ లేదు. అయితే సినిమాలో ఎంతో చక్కగా కనిపించిన సలోని.. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తన లుక్కును పూర్తిగా మార్చేసింది. కట్టూబొట్టూ కూడా మార్చేసింది. బుల్లి నిక్కర్‌లో కనిపించి సలోని అందరినీ ఆశ్చర్యపరిచింది. భానుమతి నిజంగానే మతి పోగొడుతోందిగా అనేట్టున్నారు. మొత్తానికి సలోని పెట్టిన మంటలు మాత్రం ఇప్పుడు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. సలోని హాట్ ఫోటోలు, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి యూట్యూబ్ స్టార్ వైష్ణవీ చైతన్య కూడా షాక్ అయ్యారు. మొత్తానికి సలోని లూత్రా మాత్రం టాలీవుడ్ద‌లో దూసుకుపోయేలానే ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లతో సలోని జోరు మీదున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x2B0vJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...