Sunday, 11 July 2021

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. ఆమెను తలచుకుంటూ అనన్య ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ బ్యూటీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె నానమ్మ నిన్న (శనివారం) ముంబైలో కన్నుమూశారు. వ‌యోభారం కార‌ణంగా అనారోగ్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు. అనన్య పాండే తండ్రి చుంకీ పాండే తల్లి అయిన ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు కూడా నిన్ననే పూర్తి కాగా.. తాజాగా నానమ్మను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అనన్య. ఈ మేరకు ఆమె ఫొటో షేర్ చేశారు. నానమ్మను 'నా దేవదూత' అని సంబోధించిన అనన్య.. ఆమె జన్మించినప్పుడు వైద్యులు ఆమె గుండె వాల్వ్ కారణంగా కొన్ని సంవత్సరాలు దాటి జీవించరని చెప్పారు, కానీ నా నానమ్మ అది నిజం కాదని నిరూపించి 85 సంవత్సరాల వయస్సు వరకు బ్రతికారు. పైగా ఎంతో శక్తితో ప్రతిరోజూ పని చేసేవారు. నా ఎదుగుదలలో ఆమెనే స్ఫూర్తి, ఆమెనే శక్తి ప్రదాత. మిమ్మల్ని ఎప్పటికీ మరువము అని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది అనన్య పాండే. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అనన్య పాండే.. ఆ తర్వాత ''పతి పత్ని ఔర్‌ వాహ్‌, ఖాళీ పీలీ'' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' సినిమాలో నటిస్తోంది. ముంబై బ్యాక్ డ్రాప్‌లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అనన్య బ్యూటిఫుల్ లుక్స్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hxeaaN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...