Friday, 9 July 2021

శ్రీదేవి సోడా సెంటర్: 'మందులోడా' సాంగ్ రిలీజ్ చేసిన చిరంజీవి.. ఊపేస్తున్న మణిశర్మ మాస్ బీట్

ఇటీవలే నానితో కలిసి మల్టీస్టారర్ మూవీ 'V'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ హీరో .. మరో డిఫరెంట్ సినిమా ''తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'అక్కడుంది లైటింగ్ సూరి బాబు.. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది' అంటూ మాస్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ''మందులోడా ఓరి మాయలోడా'' ఫుల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ పాట విడుదలైన కాసేపట్లోనే టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఉత్తరాంధ్ర జానపద స్ఫూర్తితో కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌కి మణిశర్మ మాస్ బీట్ తోడుకావడంతో ఈ సాంగ్ ఉర్రూతలూగిస్తోంది. సాహితి, ధనుంజయ్‌ ఆలపించిన ఈ పాటలో సుధీర్‌ బాబు తన డాన్స్ టాలెంట్ బయటపెడుతూ రెచ్చిపోయారు. మాస్ లుక్‌లో ఫుల్ హంగామా చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యశ్వంత్‌ మాస్టర్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. 70MM ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం. 4గా విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ప‌లాస 1978' సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో లైటింగ్ మెన్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. నరేష్, రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేశ్‌, హర్షవర్థన్‌, సప్తగిరి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TJ9UMx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...