Friday, 9 July 2021

తమన్నా రాకింగ్ డ్యాన్స్.. ‘కిస్ మీ మోర్’ అంటూ ఊపేసిన మిల్కీ బ్యూటీ

పరిచయమైన తొలి సినిమా నుంచే తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంటూ నెం.1 హీరోయిన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు సాధించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తమన్నా సినిమా వస్తుందంటే చాలు.. ఆమె గ్లామర్‌ని చూసేందుకు థియేటర్ల ఎదుట క్యూ కడతారు అభిమానులు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో, బాలీవుడ్‌లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీల్లోనూ పలు సిరీస్‌లతో ప్రేక్షకులకు మరింత చేరువ అయింది తమన్నా.. తమన్నా చేసిన ‘ఆహా’లో వచ్చిన ‘ది లెవంత్ అవర్’, ఆ తర్వాత ‘హాట్‌స్టార్‌’లో వచ్చిన ‘నవంబర్‌ స్టోరీ’ సిరీస్‌లు మంచి సక్సెస్ సాధించాయి. దీంతో సినిమాలతో పాటు ఈ ఫ్లాట్‌ఫామ్‌ కూడా తమన్నా దృష్టి కేంద్రీకరిస్తోంది. వరుస సినిమాలతో పాటు.. వెబ్‌ సిరీస్‌లను కూడా ఈ భామ లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సోషల్‌మీడియా విషయానికొస్తే తమన్నా.. చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఆమె అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఇక గ్లామర్‌గా ఫోటోషూట్‌లు చేస్తూ వాటిని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇక నటనతో పాటు తమన్నా డ్యాన్స్‌కి కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె నటించిన కొన్ని సినిమాల్లో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి అంటే దానికి ఆమె డ్యాన్సే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. సోషల్‌మీడియాలో కూడా ఆమె పలు సందర్భాల్లో డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా ‘కిస్‌ మీ మోర్’ అనే పాటకు తన స్నేహితురాలు షాజియా శంజీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని తమన్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘చెత్తని కట్ చేసేయాలి’ అంటూ ఈ వీడియోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌తో పాటు.. తమన్నా డ్యాన్స్‌ని మెచ్చుకుంటూ సెలబ్రిటీలు కూడా కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dXYYBo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...