Friday, 9 July 2021

అలాంటి భర్తే కావాలి.. ఇప్పుడు కుదరకపోతే వచ్చే జన్మలో అయినా అతనే కావాలి: విష్ణుప్రియా

యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు యాంకర్‌గా టీవీ ఇండస్ట్రీని కుదిపేసిన ఆమె.. ఈ మధ్యకాలంలో షూటింగ్‌లలో కనిపించడం లేదు.. అయినప్పటికీ.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తగినంత వినోదాన్ని పంచుతున్నారు. ఆ మధ్యలో ఒకసారి బిహైండ్ సీన్స్ అంటూ ఫోటో షూట్ వెనకాల జరిగే కథాకమామీషులను బయటపెట్టేశారు. అంతకు ముందు బరువు తగ్గించుకునే చిట్కాలను చెప్పుకొచ్చారు. అలా విష్ణుప్రియ నిత్యం ఏదో ఒక వీడియోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. అయితే గతకొంతకాలంగా సోషల్‌మీడియా ద్వారానే విష్ణుప్రియ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఆమెకు సంబంధించిన విషయాలను ఈ మాధ్యమం ద్వారానే ఫ్యాన్స్‌కి తెలియజేస్తున్నారు. ఒక్కప్పుడు ఓ ప్రముఖ షోలో యాంకర్‌గా చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. బుల్లితెరకు ఎందుకు దూరం అయ్యారో ఎవరూ ఊహించలేని ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ, విష్ణుప్రియకు వచ్చిన పాపులారిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఆమె ఎప్పుడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుందా అంటూ లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అభిమానులు కోరినట్లుగానే తరచూ అందమైన ఫోటోషూట్‌లు, హాట్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. కుర్రకారులో హీటెక్కిస్తుంది విష్ణుప్రియ. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సంభాషించింది. ఈ సందర్భంగా తనకు ఎలాంటి భర్త కావాలనే విషయాన్ని ఆమె వెల్లడించింది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ఆషికీ-2’ సినిమాలో హీరోగా నటించిన ఆదిత్య రాయ్ కపూర్ లాంటి భర్త తనకు కావాలని విష్ణుప్రియ కోరుకుంది. ఈ జన్మలో కాకపోయినా.. వచ్చే జన్మలో అయినా అలాంటి భర్త తనకి దక్కితే ఎంతో సంతోషిస్తానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తను కోరుకున్న భర్త ఈ జన్మలోనే దక్కాలి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qVUTmF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...