Friday, 9 July 2021

మరింత యంగ్‌గా మారిన దిల్ రాజు.. మనవడి ఫంక్షన్‌లో నిర్మాతదే హవా!

రెండో పెళ్లి తరువాత రోజురోజుకూ యంగ్ అవుతున్నారు. ఫిట్ నెస్ మీద మరింత దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తన భార్య తేజస్వినితో కలిసి ఆ మధ్య ఆటలు ఆడుతున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక దిల్ రాజు 50వ బర్త్ డే వేడుకల్లోనూ ఆయన ఫిట్ నెస్ మీద చర్చలు జరిగాయి. మొత్తానికి ఈ స్టార్ ప్రొడ్యూసర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిస్తున్నారు. తాజాగా దిల్ రాజు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆయన ఇంట్లో జరిగిన ఈ వేడుకలు, వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిర్మాత దిల్ రాజు మనవడు ఆరాన్ష్ ధోవతి ఫంక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ వేడుకలో తెలుపు దుస్తుల్లో దిల్ రాజు మెరిశారు. మిగతా వారంతా కూడా డ్రెస్ కూడా పాటించినట్టు కనిపిస్తోంది. యెల్లో, వైట్ కాంబినేషన్‌లో కుర్తాలు ధరించారు. ఇక దిల్ రాజు తన మనవడిని భుజాన ఎత్తుకుని మురిసిపోతోన్నారు. మొత్తానికి దిల్ రాజు కుర్రాడిలా మారిపోతోన్నారనే టాక్ వినిపిస్తోంది. ఆరాన్ష్ దిల్ రాజు కూతురు అబ్బాయి. ఈ వేడుకల్లో దిల్ రాజుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. దిల్ రాజు గత ఏడాది కరోనా సమయంలోనే రెండో వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు కలిసి వచ్చిన నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు దిల్ రాజు భారీ ప్రాజెక్ట్‌లతో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇక బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్‌తో దిల్ రాజు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hyB0z7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...