Tuesday, 20 July 2021

పెళ్లి తర్వాత ఇదీ పరిస్థితి! మా ఆయన ఎలాంటి వారంటే.. ప్రియమణి ఎమోషనల్ కామెంట్స్

సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఒకానొక సమయంలో టాలీవుడ్ అగ్రహీలందరితో ఆడిపాడి సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. 2017 సంవత్సరంలో ముస్తఫా రాజ్ అనే యువకుడిని పెళ్ళాడి ఆ తర్వాత తన హవా తగ్గించింది. అయితే అది కొన్నేళ్లే. భర్తతో కొంతకాలం హాయిగా గడిపి మళ్ళీ ఇప్పుడు బుల్లితెర, వెండితెర అవకాశాలతో బిజీ అయింది. ఈ క్రమంలోనే నేడు (జులై 20) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించింది. విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'నారప్ప' మూవీలో ప్రియమణి క్యారెక్టర్ అట్రాక్ట్ చేసింది. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అసురన్’ని తెలుగులో ‘నారప్ప’గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఒరిజినల్ వర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రియమణి. ఈ నేపథ్యంలో ఆమెతో కొన్ని మీడియా సంస్థలు ఆన్ లైన్ ఇంటర్వ్యూలు చేయగా 'నారప్ప' సంగతులతో పాటు తన భర్త గురించి కూడా చెప్పింది. హీరో వెంకటేష్‌తో కలిసి నటించాలనే కల 'నారప్ప'తో నెరవేరిందని ప్రియమణి చెప్పింది. మంజు వారియర్ నుంచి తాను ఎలాంటి సలహాలు తీసుకోలేదని, ఈ మూవీలో చేసిన రోల్ కోసం పెద్దగా హోమ్ వర్క్ కూడా చేయలేదని చెప్పిన ఆమె.. కేవలం డైరెక్టర్ సూచనల మేరకు ఫాలో అయి నటించానని తెలిపింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తనకు ఛాలెంజింగ్‌గా అనిపించాయని చెప్పింది. ఇకపోతే తన భర్త సపోర్ట్ గురించి మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలు సెలక్ట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాని చెప్పుకొచ్చింది. తనకు ఏ ప్రాజెక్టులో ఆఫర్ వచ్చినా ముందుగా భర్తతో డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపింది. తనను ఎంతగానో అర్థం చేసుకునే భర్త దొరికినందుకు చాలా లక్కీ అని చెబుతూ కాస్త ఎమోషనల్ అయింది ప్రియమణి. గతంలో కూడా చాలా సందర్భాల్లో తన భర్త ముస్తఫా గురించి గొప్పగా చెప్పింది ఈ సీనియర్ హీరోయిన్. కథ డిమాండ్‌ చేస్తే ఎక్స్‌పోజింగ్‌, గ్లామర్‌ రోల్స్ చేసేందుకు రెడీ అని ఆమె తెలపడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hTlA8o
v

No comments:

Post a Comment