Tuesday, 20 July 2021

నటి కుష్భూకి ఊహించిని షాక్ ఇచ్చిన హ్యాకర్లు.. సహాయం చేయండంటూ విజ్ఞప్తి..

సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులకు ఎప్పుడు చేరువలోనే ఉంటుంది నటి కుష్భు. ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ పరిశ్రమలను షేక్ చేసిన ఆమె.. ఇప్పుడు రాజకీయాల్లోనూ తన జోరును అలాగే కొనసాగిస్తుంది. కొన్ని నెలల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తరఫున థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. ఘోర పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ.. నిరాశ చెందకుండా పార్టీ కోసం ఆమె సోషల్‌మీడియా వేదికగా కృషి చేస్తూనే ఉంది. రాజకీయ అంశాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. నిత్యం ఫోటోలు, ఇతర విషయాలను పోస్ట్ చేస్తూ.. చాలా యాక్టివ్‌గా ఉంటారామె. అయితే తాజాగా ఆమెకి హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ఆమె ఖాతాని హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని, పాస్వర్డ్ మార్చడానికి కూడా వీలు కావడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పలు అసభ్యకర పోస్టులు, రాజకీయ వరంగా వ్యతిరేకమైన పోస్టులు కూడా ఆమె ఖాతాలో హ్యాకర్లు పోస్ట్ చేశారు. దీనిపై సహాయం కోరితే ట్విట్టర్ సంస్థ కూడా ఎలాంటి స్పందన ఇవ్వడం లేదంటూ ఆమె పేర్కొన్నారు. అంతేకాదు తన అకౌంట్ సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. తనకు ఏం చేయాలో తోచడం లేదని.. ఈ సమస్యను పరిష్కరిస్తే వారికి ధన్యవాదాలు తెలుతాను అంటూ ఆమె స్పష్టం చేశారు. గత ఏడాది కూడా కుష్భు అకౌంట్‌ని హ్యాక్ చేశారు. అంతేకాదు.. ఆమె ప్రొఫైల్ పేరును కూడా బ్రియాన్‌గా మార్చేశారు. మరోసారి కుష్భు ఖాతా హ్యాక్ కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wSq5V2
v

No comments:

Post a Comment