Tuesday, 20 July 2021

ప్రకృతి పాడిన పాట ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుదంటూ.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ట్వీట్..

ప్రస్తుతం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తికా ఎదురుచూస్తున్న చిత్రం.. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘’ మెగా పవర్ స్టార్ , యంగ్ టైగర్ హీరోలుగా నటిస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్‌తో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి కారణంగా రెండు సార్లు వాయిదాపడటం.. ఈ క్రమంలో సినిమా విడుదల కూడా వాయిపడటం అభిమానులను నిరాశపరిచింది. అయినప్పటికీ.. టీజర్లు, పోస్టర్ల ద్వారా చిత్ర యూనిట్ అభిమానులకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, తాజాగా విడులదైన ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోలతో కలిపి ఓ ప్రమోషనల్ పాటని కూడా విడుదల చేయనున్నారని సమాచారం. అంతేకాక.. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్‌లో సినిమాను అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకి రాజమౌళి సోదరుడు, ఎంఎం సంగీతం సమకూరుస్తున్నారనే విషయం తెలిసిందే. మంగళవారం ఈ సినిమాలో ఓ పాట పాడిన ప్రకృతి అనే చిన్నారి పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కీరవాణి ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్‌’లోని తన పాటకి ప్రకృతి గొంతు మరింత జీవం పోసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ని ఆర్ఆర్ఆర్‌ టీమ్ రీ ట్వీట్ చేసింది. ఆ పాట తమ గుండెల్లో నిలిచిపోతుందన్న టీమ్.. దాన్ని ప్రపంచానికి ఎప్పుడు వినిపించాలా అని ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36KJrRD
v

No comments:

Post a Comment