Tuesday, 27 July 2021

‘పేరు పోగొట్టుకున్న కృష్ణవంశీ అంటే నాకెంతో ఇష్టం’

హిట్టు ఫట్టులది ఏముంది సార్.. బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడల్లా ఆ బొమ్మతీసినోడి గురించి ప్రతిఒక్కరు చెప్పుకుంటారు.. అంకెలతో గుర్తించుకునే సినిమా లెక్కలు కొన్నైతే.. అంకెలతో సంబంధంలేని అభిమానంతో కొలిచే దర్శకులు కొందరే ఉంటారు. వాళ్లలో క్రియేటివ్ దర్శకుడు ఒకరు. నేడు (జూలై 27) ఆయన బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంలో శ్రీకాకుళం వాసి.. రచయిత ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి తన ఫేస్ బుక్ ద్వారా కృష్ణవంశీకి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ‘పేరు పోగొట్టుకున్న అంటే నాకెంతో ఇష్టం’ అంటూ రాసిన రైటప్ మీకోసం. ‘సినిమా అనే లోకం నుంచి సినిమాకు విరుద్ధం అయిన లోకం వ‌ర‌కూ బ‌త‌క‌డం తెల్సుకోవ‌డం ఓ క‌ర్త‌వ్యం.. ఆ ప‌ని ఎప్పుడో చేశాడు కృష్ణ‌వంశీ.. రైటింగ్ ప్యాడ్ విసిరి కొట్టాక పుట్టిన స‌న్నివేశాలే జీవితాన్ని మార్చాయి.. రామూ స‌ర్ మాకు ఇవ‌న్నీ నేర్పారు .. ఎలా బ‌త‌కాలో ఎలా ఉండ‌కూడ‌దో ఇవ‌న్నీ ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకున్నాం. అస‌లు సినిమాను పూర్తి చేయ‌డం క‌న్నా సినిమా తీయ‌డంలో ఉన్న క‌ళ‌నే ప్రేమించ‌డం నేర్పాడు ఆర్జీవీ.. ఇవాళ కృష్ణ‌వంశీ పుట్టిన్రోజు.. కొన్ని పాట‌లు ఆయ‌న పుట్టిన్రోజున గుర్తుకువ‌స్తాయి.. కొన్ని సినిమాలు ఆయ‌నేంటో చెప్ప‌క‌నే చెబుతాయి.. డ‌బ్బులున్నాయ‌న్న గ‌ర్వం డ‌బ్బులు పోయాయి అన్న బాధ.. రెండూ లేకుండా జీవించ‌డంలో అర్థం ఉంది.. ఇంకా చెప్పాలంటే అదే గొప్ప క‌ళ.. ఆయ‌న సినిమాకు పాట రాయ‌డం అనే వ‌రం ఎంద‌రో అందుకున్నారు. వ‌రం కాదు శాపం అని తిట్టుకున్నారు కూడా.. అయినా మంచి పాట వ‌చ్చిన ప్ర‌తిసారీ ఎంత ఆనందించానో! ఇప్పుడెందుకు ఇలా రావ‌డం లేదు రాయ‌డం లేదు అన్న కోపం ఇత‌రుల సినిమాలు చూస్తే వ‌స్తాయి.. రావాలి కూడా. ఇవాళ మ‌ళ్లీ మ‌న అజ్ఞానాన్ని ఆజ్ఞా పూర్వ‌కంగా ప్ర‌శ్నించుకుంటే కృష్ణ‌వంశీ క‌న‌ప‌డ్తాడు.. ఒక పాట అనే పిచ్చి లో తూగి సినిమా తీసి ఆనందం పోగొట్టుకుని ఒంట‌రి అయిపోయిన కృష్ణ వంశీ క‌న‌ప‌డ్తాడు.. పేరు పోగొట్టుకున్న కృష్ణ వంశీ అంటే నాకెంతో ఇష్టం.. ఎందుకంటే వాటిని పట్టించుకోడు క‌నుక .. ఏ సక్సెస్ లేకుండా బ‌తికిన కృష్ణ‌వంశీ అంటే ఇంకా ఇష్టం.. మ‌నం సినిమాల‌ను గ్లోరిఫై చేయ‌డం మానుకుంటే ఏదో ఒక‌టి త‌నకు చేత‌నైంది చేస్తాడు.. పాపం ఆయ‌నను ఆయ‌న‌లా ప‌ని చేయనివ్వ‌ని నిర్మాత‌లు కొంద‌రున్నాక ఆయ‌నేం చేస్తాడు. ఎనీవే రంగ మార్తాండ అనే సినిమా తో మ‌ళ్లీ కొత్త కృష్ణ వంశీ మ‌న‌ల్ని ప‌ల‌క‌రించాల‌న్న‌ది నా కోరిక.. ల‌వ్ యూ స‌ర్ .. హ్యాపీ బ‌ర్త్ డే టీపీ గూడెం పిల్లోడా... - ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iTYoq8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...