తమిళ హీరోలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మందువరుసలో ఉంటారు. సీనియర్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌తో మొదలుపెడితే మధ్య తరం నటులు, అజిత్, విజయ్, సూర్య, విక్రమ్‌లు.. ఇప్పుడు ఈ జనరేషన్ నటులు , శివ కార్తికేయన్ తదితరుల వరకూ అందరిని ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. వాళ్ల సినిమాలు విడుదల అవుతున్నాయంటే.. థియేటర్ల వద్ద ఎంతో కోలాహలం సృష్టిస్తారు. అంతేకాదు.. కొందరు తమిళ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటులలో ధనుష్ ఒకరు. హీరో రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ.. తనకంటూ ఓ ప్రత్యేకమన గుర్తింపు తెచ్చుకున్నాడు అతను. విలక్షణమైన సినిమాలు చేస్తూ ప్రేక్షఖులను అలరిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ‘రఘువరన్ బీటెక్’ అనే సినిమాతో ధనష్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. ఆ తర్వాత అతను చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ప్రస్తుతం ధనుష్ తన 43వ సినిమా షూటింగ్‌లో త్యాగరాజన్ సమర్పణలో జరుగుతోంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి.. ఫస్ట్‌లుక్‌ను జులై 28వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TFrVLC
v
No comments:
Post a Comment