Saturday, 3 July 2021

అసెంబ్లీ ముందు నగ్నంగా సంపూర్ణేష్ బాబు.. ఒంటిపై నూలుపై పోగులేకుండా ‘క్యాలీఫ్లవర్’‌తో షాకింగ్ లుక్

సినిమాల్లో చేయాల్సిన దానికన్నా కాస్త ఎక్కువ చేస్తే అతి అంటారు.. ప్రేక్షకులు అసహ్యించుకుంటారు. కానీ చాలా డిఫరెంట్.. తను ఎంత అతి చేస్తే ప్రేక్షకులు అంత నవ్వుకుంటారు. అందుకే అతను బర్నింగ్ స్టార్ అయ్యాడు. అయితే ఈ చిత్రం తాజా పోస్టర్ చూస్తే ఓర్నాయనో అని అనడం ఖాయమే. “క్యాలీఫ్లవర్” సినిమా ఏంట్రా నాయనా.. అనేట్టుగా ఈ సినిమా టైటిల్ ఉండగా.. ఆ టైటిల్‌కి యాప్ట్ అయ్యేట్టుగా తన మార్క్ పోస్టర్‌ను విడుదల చేశారు సంపూర్ణేష్ బాబు. శాసనసభ ఎదుట.. సాక్షిగా.. శీలో రక్షతి రక్షితః అంటూ ఒంటిపై నూలు పోగు లేకుండా.. నగ్నంగా.. ఒంటినిండా గాయాలతో.. అసెంబ్లీ ఎదుట ‘క్యాలీఫ్లవర్’ని అక్కడ అడ్డుగా పెట్టుకుని షాక్ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. బ్యాగ్రౌండ్‌లో అసెంబ్లీ.. చుట్టూ పోలీసులు.. నగ్నంగా సంపూర్ణేష్ బాబు.. కింద కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్న మీడియా.. ఇవన్నీ చూస్తుంటే.. ‘క్యాలీఫ్లవర్’తో ఏదో చేసేట్టుగానే కనిపిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గూడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీప్ ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hzpSR0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...