Saturday, 3 July 2021

ఈ జీవితానికి సరిపోయేంత సంతోషం.. దళపతి ప్రేమకు జానీ మాస్టర్ ఫిదా!

పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. రౌడీ బేబీ పాటలో జానీ మాస్టర్ పాత్ర, బుట్టబొమ్మ పాటకు కంపోజ్ చేసిన కూల్ స్టెప్స్ అన్నీ కూడా జానీ మాస్టర్‌ను పాపులర్ చేశాయి. కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కోలీవుడ్‌లోనూ దూసుకుపోతోన్నారు. ఇక ఉత్తరాదినా సత్తా చాటేందుకు సిద్దంగానే ఉన్నారు. అయితే జానీ మాస్టర్ లెవెల్‌ సోషల్ మీడియాలో మామూలుగా లేదు. ఓ కొరియోగ్రాఫర్‌ బర్త్ డే సందర్బంగా నేషనల్ వైడ్ హ్యాపీ బర్త్ డే విషెస్ ట్రెండ్ అవ్వడం మామూలు విషయం కాదు. నిన్న జానీ మాస్టర్ బర్త్ డే. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో జానీ మాస్టర్ పేరు మార్మోగిపోయింది. అయితే నిన్న జానీ మాస్టర్ దళపతి బీస్ట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అందుకే అక్కడే టీం బర్త్ డేను సెలెబ్రేట్ చేసింది. ఈ వేడుకలో దళపతి విజయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక దళపతి చూపిన ప్రేమకు జానీ మాస్టర్ ఫిదా అయినట్టు ఆ ఫోటోలను చూస్తేనే తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలా నిన్న జానీ మాస్టర్ బర్త్ డే సెట్స్‌పైనే మేకర్స్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడంతో జానీ మాస్టర్ గాల్లో తేలిపోయారు. దళపతిని గట్టిగా హత్తుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ జీవితానికి ఇది చాలు అన్నట్టుగా బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hxKPvD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...