Saturday, 3 July 2021

అది నా పర్సనల్.. ప్రెగ్నెన్సీ వార్తలపై సింగర్ చిన్మయి షాకింగ్ పోస్ట్

కేవలం సింగర్ గానే కాకుండా సామాజిక అంశాలపై గళం ఎత్తుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు . మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ.. సంచలన విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు సింగర్ చిన్మయి. తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లపై రియాక్ట్ అవుతూ ఘాటుగా స్పందించారు చిన్మయి. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవిచంద్రన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సింగర్ చిన్మయి.. ఇటీవల తన మరిది పెళ్లి వేడుకలో మ‌డిసార్ సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించారు. అయితే మ‌డిసార్‌లో ఉండటం వలన సింగర్ చిన్మయి పొట్ట పైకి వచ్చినట్టుగా ఫొటోల్లో కనిపించింది. ఈ ఫొటోపాటుగా చిన్మయి పెళ్లినాటి ఫొటోలో కూడా మ‌డిసార్‌‌లోనే ఉంది. ఈ ఫొటోలు వైరల్ కావడంతో.. దీంతో ఆమె గర్భవతి అంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే వీటిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు చిన్మయి. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. “ఇది మా పెళ్లిఫోటో.. మ‌డిసార్ వ‌ల‌న నా పొట్ట పెద్ద‌దిగా క‌నిపిస్తుంది. మ‌డిసార్ క్యారీ చేయ‌డం నాకు కుదర్లేదు.. ఇటీవల మా మరిది వివాహంలో కూడా మడిసార్ కట్టాను. అది చూసి నేను ప్రెగ్నెంట్ అని.. వార్తలు వస్తున్నాయి. ఆ వస్త్రాల వలనే నేను అలా కనిపిస్తున్నాను. అంతేతప్పు నేను ప్రెగ్నెంట్ కాదు.. ఆ పొటోలను చూసి నేను గర్భవతిని అంటూ వస్తున్న పూకార్లు చూసి విసిగిపోయాను. నా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే.. ఆ విష‌యాన్ని మీతో షేర్ చేసుకోవ‌చ్చు లేదా చేసుకోక పోవ‌చ్చు.. అది నా ఇష్టం. అయితే నూటికి నూరు శాతం మా పిల్ల‌ల ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌ను. వారు సోషల్ మీడియాకి దూరంగానే ఉంటారు. ఇక‌నైనా ఈ పుకార్లు ఆపండి’ అంటూ రూమ‌ర్స్‌కి చెక్ పెట్టింది చిన్మయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V3sHCu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...