Saturday, 3 July 2021

మెహరీన్ సంచలన నిర్ణయం.. నిశ్చితార్థం తరువాత సీఎం మనవడితో బ్రేకప్.. రోజుల వ్యవధిలోనే

టాలీవుడ్ హీరోయిన్ పీర్జాదా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మెహరీన్ సంచలన ప్రకటన చేసింది. 2021 మార్చిలో మెహరీన్-భవ్య భిష్ణోయ్‌ నిశ్చితార్థం జైపూర్‌‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటూ తాము విడిపోతున్నామని షాకింగ్ ప్రకటన చేసింది . ఇద్దరూ కలిసి, స్నేహపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది మెహరీన్. ఇకపై భవ్య బిష్ణోయ్ తో కానీ, ఆయన కుటుంబసభ్యులతో కానీ తనకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చేసింది మెహరీన్. తన ఫోకస్ అంతా ఇకపై సినిమాలపైనా పెడతానంటూ క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది మెహ్రీన్. తాను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తారని.. అభిమానుల్ని అలరిస్తారని తెలియజేస్తూ ట్వీట్ చేసింది మెహరీన్. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో నటిస్తున్న మెహ్రీన్ అంతకుముందు ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, వంటి చిత్రాల్లో నటించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qIyjOd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...