Monday, 5 July 2021

Alia Bhatt : హీరోయిన్‌ను సినిమా ఛాన్స్ అడుక్కున బాద్ షా.. షారుఖ్-అలియా ట్వీట్లు వైరల్

బాలీవుడ్ బాద్ షా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. స్వయంగా నిర్మాత, అతి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉన్న షారుఖ్ ఓ సినిమా చాన్స్ ఇవ్వమని హీరోయిన్‌ను అడుక్కున్నారు. ఈ మేరకు వేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే?.. నిర్మాతగా మారారు. తన సొంత ప్రొడక్షన్ కంపెనీలో ఓ చిత్రాన్ని అలియా భట్ ప్రారంభించారు. నిర్మాతగా మారడమే కాకుండా అందులో ఓ క్యారెక్టర్‌ను అలియా భట్ పోషిస్తున్నారు. అలా మొత్తానికి నిర్మాతగా మారిన అలియా భట్ డార్లింగ్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు సెట్లో అడుగుపెట్టబోతోన్నానని, కొంత నర్వస్‌గా ఫీల్ అవుతున్నానని అలియా భట్ ఓ పోస్ట్ చేశారు. దీనిపై షారుఖ్ సెటైర్ వేశారు. నిర్మాతగా తన మొదటి ప్రాజెక్ట్ అని అలియా చెప్పడంపై షారుఖ్ కౌంటర్ వేశారు. తరువాతి నీ ప్రాజెక్ట్‌లో నాకు చాన్స్ ఇవ్వవా? నన్ను హీరోగా పెట్టుకోవా? అని అలియాను షారుఖ్ రిక్వెస్ట్ చేశారు. అలా షారుఖ్ వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. అయితే అలియా ఇచ్చిన రిప్లై కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అంత కంటే ఏం కావాలి.. మీకు ఆఫర్ ఇచ్చేశా.. సైన్ కూడా చేసేశా అని లవ్యూ చెప్పేశారు. ఇలా అలియా షారుఖ్ ట్వీట్ల ముచ్చట్లు నెట్టింట్లో వైరల్ కాసాగాయి. గతంలో షారుఖ్ అలియాలు కలిసి 2016లో వచ్చిన డియర్ జిందగీలో నటించిన సంగతి తెలిసిందే. ఇక అలియా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అలియా కనిపించనున్నారు. ఇక షారుఖ్ సైతం అట్లీ దర్శకత్వంలో నటించేందుకు రెడీగా ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SRTz7M
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...