Monday, 5 July 2021

ప్రియుడికి బ్రేకప్ చెప్పిన మెహ్రీన్.. పాత ఫ్యామిలీలో అడుగుపెడుతూ ఫొటో వదిలింది

కాంగ్రెస్ యువ నేత.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న మెహ్రీన్.. ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుకను జరుపుకున్న విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి వార్త ఉండబోతుండగా.. అందరికీ షాకిస్తూ.. పెళ్లి క్యాన్సిల్ అనేసింది మెహ్రీన్. ఏమైందో ఏమో కానీ.. నిశ్చితార్థం అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే అతడికి బ్రేకప్ చెప్పేసి.. నీ దారి నీదే నా దారి నాదే అనేసింది మెహ్రీన్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇక అతనితో కానీ అతని ఫ్యామిలీతో కూడా ఎలాంటి రిలేషన్ ఉండదని చెప్పేసింది. అయితే నిశ్చితార్థం తరువాత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ పెట్టారని అది మెహ్రీన్‌కి నచ్చకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు వచ్చాయి. అయితే భవ్య బిష్ణోయ్ మాత్రం.. మెహ్రీన్‌తో విడిపోయినందుకు బాధగా లేదని.. పెళ్ళి విషయంలో తన కుటుంబాన్ని నిందిస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యాడు. ఇవన్నీ పక్కనపెడితే.. ఇకపై సినిమాలు కెరియర్ మాత్రమే అంటూ బ్రేకప్‌ ట్వీట్‌లో చెప్పుకొచ్చిన మెహ్రీన్ అనుకున్నట్టుగానే సినిమాలతో బిజీ అయ్యింది. ఎఫ్ 2 చిత్రంలో హనీగా అలరించిన మెహ్రీన్.. F3 ఫ్యామిలీలో జాయిన్ అయ్యింది. ఈ సినిమా సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ తదితరులతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. తన ఫేవరెట్ 'ఎఫ్ 3' ఫ్యామిలోకి తిరిగొచ్చానని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది మెహ్రీన్. ఈ ఫొటోలు ఫుల్ జోష్‌లో కనిపిస్తూ సందడి చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yjfcwG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...