ఇటీవల నందమూరి పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ముచ్చటిస్తూ.. వారి అభిప్రాయాలను కోరికలను తెలుసుకున్నారు. ఈ సందర్భంలో సార్.. మీరు యంగ్ డైరెక్టర్స్‌తో చేయాలి.. లాంటి దర్శకుడితో మంచి సినిమా చేస్తూ చూడాలని ఉందని ఓ అభిమాని తన మనసులో కోరికను బయటపెట్టాడు. ఆ లైవ్ కాల్‌లోనే నందమూరి బాలకృష్ణ అభిమానుల కోరికపై సానుకూలంగా స్పందిస్తూ.. ‘హో తప్పకుండా.. మంచి కథ వస్తే తప్పుకుండా చేస్తాం.. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్‌తో కూడా చేస్తున్నాంగా.. గోపిచంద్ మలినేని సినిమా వస్తుంది.. త్వరలో మిగతా దర్శకులతో కూడా చేస్తాం అని హామీ ఇచ్చారు. అయితే త్వరలో నందమూరి అభిమానులు కోరిక తీరబోతుంది. టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరొందిన అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ కాంబో మూవీ త్వరలో సెట్స్‌పై వెళ్తేందుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి బాలయ్య 100 సినిమా అనీల్ రావిపూడితో చేయాల్సి ఉండగా.. అది మిస్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబో సెట్ అయ్యింది. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ చిత్రాన్ని రూపొందిస్తున్న అనీల్ రావిపూడి.. ఇటీవల బాలయ్య కోసం అదిరిపోయే లైన్ ఒకటి చెప్పారట. అది బాలయ్యకు విపరీతంగా నచ్చేయడంతో ఆ లైన్‌ని డెవలప్ చేసే పనిలో ఉన్నారట అనీల్ రావిపూడి. ఇప్పటివరకూ నందమూరి బాలకృష్ణ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్ కాగానే.. అనీల్ రావిపూడితో బాలయ్య మూవీ ఉండబోతున్నట్టు ప్రచారం నడుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jEToro
v
No comments:
Post a Comment