Thursday, 24 June 2021

Swiggy : రెస్టారెంట్ బండారాన్ని బయటపెట్టిన బ్యూటీ.. నివేదా పేతురాజ్ తెగువకు నెటిజన్లు ఫిదా

సోషల్ మీడియా శక్తిని తక్కువ అంచనా వేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. సాధారణ జనం నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ తప్పును వేలెత్తి చూపిస్తుంటారు. అయితే ఇందులో సెలెబ్రిటీలు చూపించే తప్పులు మాత్రం వెంటనే సమసిపోతాయి. ఈ మధ్య సోషల్ మీడియా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఆ మధ్య జొమాటో కేసు ఎంతటి సంచలనానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వల్ల ఆ కేసు గతి మారిపోయింది. ఇక అంతకు ముందు పార్కులో సంయుక్త హెగ్డే మీద జరిగిన దూషణలు, దాడి కూడా సోషల్ మీడియా వల్లే మారిపోయింది. ఇప్పుడు నివేదా పేతురాజ్‌కు ఓ ఘటన ఎదురైంది. తాజాగా ఆమె ఆర్డర్ చేసుకున్న ఫుడ్‌లో బొద్దింక వచ్చింది. దీంతో దెబ్బకు షాకైన నివేదా ఆ హోటర్ బండారాన్ని బయటపెట్టేసింది. అంతే కాకుండా దాన్ని డెలివరి చేసిన స్విగ్గి సంస్థను కూడా ఏకిపారేసింది. ఈ విషయాన్ని బహిరంగంగా సోషల్ మీడియా వేదిక చెప్పడంతో అందరూ శభాష్ అని ప్రశంసలు కురిపించారు. ఇక నివేదా చేసిన పోస్ట్‌కు నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇంతకు ముందు కూడా తమకు ఇలాంటి ఘటనలే ఎదురయ్యాయ్ అంటూ ఆ హోటల్ మీద పుంఖానుపుంఖాలుగా మెసెజ్‌లు పంపించారు. దీంతో ఫుడ్ సెఫ్టీ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. ఆ హోటల్ మీద దాడి చేసింది. అందులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కుళ్లిన మాంసం కుప్పలుకుప్పలుగా పడి ఉందట. అలా చేసిన పోస్ట్‌తో హోటల్ తతంగం అంతా కూడా బయటపడింది. అయితే ఇదంతా కూడా తన వల్ల మాత్రమే కాదని, స్పందించిన నెటిజన్లందరిదని చెప్పుకొచ్చారు. ఇంకా కొంత మంది మెసెజ్‌లు పోస్ట్ చేయలేకపోయానని నివేదా చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T6jWXs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...