Thursday, 24 June 2021

అది ఓపెన్ చేయడంలోనే సంతృప్తి.. పూజా హెగ్డే కొంటె చేష్టలు!

బుట్టబొమ్మ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. పూజా హెగ్డే చేసే కొంటె చేష్టలకు అందరూ ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో పూజా హెగ్డే పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేస్తుంటారు. తన పేరెంట్స్, తన చెల్లి గురించి నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న పూజా హెగ్డే ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడుపుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో తన ఇంట్లోకి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా పూజా హెగ్డే తన ఇంటికి వచ్చిన గిఫ్ట్ గురించి చెబుతూ ఓ పోస్ట్ చేశారు. మామూలుగా అయితే క్రిస్మస్ వస్తే ఇలాంటివి ఇంటికి వస్తుంటాయని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.యాపిల్ కంపెనీ నుంచి మ్యాక్ కంప్యూటర్ పూజా హగ్డే ఇంట్లోకి వచ్చేసింది. అలాంటి కొత్త వస్తువులను ముందుగా తామే ఓపెన్ చేయాలని చిన్నతనంలో అల్లరి చేస్తుంటారు. అలా పూజా హెగ్డేకు కూడా కొత్తవి ఓపెన్ చేయడమంటే ఇష్టమున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఓపెన్ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. ఇక కొత్త మ్యాక్ కంప్యూటర్‌ను తాను ప్రారంభించినట్టు చెబుతూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు పూజా హెగ్డే తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ , మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్, దళపతి విజయ్ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ షూటింగ్‌లంటూ తారలు బిజీ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vSUDFT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...