Tuesday, 22 June 2021

Sai Pallavi: దుమ్ముదులుపుతున్న సారంగ దరియా.. నాలుగు నెలల్లోనే ఏకంగా 25 కోట్లు

సోషల్ మీడియా సెన్సేషన్ అయింది 'సారంగదరియా' సాంగ్. నాగ చైతన్య, జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ఈ పాట ఇప్పటికే పలు రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. దాని కుడి భుజం మీద కడువా.. అంటూ సాగిపోయిన ఈ జానపదం విడుదలైన మరుక్షణం నుంచే వేగం పెంచేసింది. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు ఆమె డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, ఉత్సాహంగా మంగ్లీ పాడిన తీరు సామాన్యుడి నుంచి విశిష్ట వ్యక్తుల దాకా అందరికీ ఆకట్టుకున్నాయి. ఇక శేఖర్ మాస్టర్ స్టెప్పులను సాయి పల్లవి తనదైన స్టైల్‌లో చేసి చేసింది. దీంతో రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ సాంగ్ తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించింది. అతి తక్కువ కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్‌ రాబట్టడమే గాక.. మొదటి నాలుగు నెలల్లోనే 25 కోట్ల వ్యూస్‌తో సోషల్ మీడియా దుమ్ముదులుపుతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో ఈ 'లవ్ స్టోరీ' సినిమా రూపొందిస్తున్నారు శేఖర్ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో వాయిదా పడింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రలు పోషించారు. చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ప్రేక్షక లోకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TUQIea
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...