Tuesday, 22 June 2021

తప్పు చేశానని అర్థమైంది.. ఇకపై అలాంటి పనులు చేయను! హెబ్బా పటేల్ ఓపెన్ కామెంట్స్

ఏ వ్యక్తి అయినా తప్పు చేయడం సహజం. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే తప్పులు జరిగిపోతుంటాయి. తీరా ఆ విషయం తెలిసే సరికి అవ్వాల్సిన డామేజ్ అయిపోతుంది. యంగ్ హీరోయిన్ విషయంలో కూడా అదే జరిగిందట. ఇప్పుడు తాను చేసిన తప్పు తెలుసుకున్నానని, ఇక అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటానని అంటోంది హెబ్బా. ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే 'కుమారి 21 ఎఫ్' సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా కుర్రాళ్ళ మనసు దోచేసిన ఈ భామ.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన స్టార్ స్టేటస్ మాత్రం పట్టలేకపోయింది. ఆమె ఎంపిక చేసుకున్న సినిమాలు హిట్ బాట పట్టకపోవడంతో క్రమంగా అవకాశాలు కరువయ్యాయి. అయితే ఇటీవల రామ్ 'రెడ్' సినిమాలో హీటెక్కించే సాంగ్‌తో మళ్లీ తన వేట షురూ చేసింది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ విరామ సమయంలో తాను చేసిన తప్పులను సమీక్షించుకున్నానని చెప్పింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇకపై భవిష్యత్తు అంతా బాగుంటుందన్న ధీమా వ్యక్తం చేసింది. ఒకానొక సమయంలో కెరీర్ గురించి ఆలోచిస్తే భయమేసిందని, ఇకపై కథల ఎంపిక విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం చేస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్ర సంతృప్తికరంగా అనిపించిందని ఆమె తెలిపింది. మరోవైపు కెరీర్ గాడిలో పెట్టుకునే పని భాగంగా సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది హెబ్బా పటేల్. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఇటు ప్రేక్షకులను, అటు దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేస్తోంది. సో.. చూడాలి మరి ఇకనైనా అమ్మడికి మంచి రోజులొస్తాయా.. లేదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SNU6HU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...