Tuesday, 22 June 2021

Jani Master : Beastపై కొరియోగ్రఫర్ కామెంట్.. భారీ ఆఫర్ పట్టేసిన జానీ మాస్టర్

టాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ వరుసలో కచ్చితంగా ఉంటారు. రౌడీ బేబీ పాటలో ప్రభుదేవాతో కలిసి స్టెప్పులు కంపోజ్ చేశారు. ఆ పాటతో ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు. ఇక బుట్టబొమ్మ పాటతో జానీ మాస్టర్ పేరు ఖండాలు దాటేసింది. అలా జానీ మాస్టర్ కెరీర్‌లో బుట్టబొమ్మ పాట స్పెషల్‌గా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు జానీ మాస్టర్‌కు కోలీవుడ్‌లోనూ భారీ ఆపర్లు వస్తున్నాయి. తాజాగా జానీ మాస్టర్ దళపతి బీస్ట్ సినిమాపై పోస్ట్‌లు పెట్టేశారు. ఇందులో తనకు చాన్స్ వచ్చిందంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. నిన్న వచ్చిన ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ సినిమా ఫీస్ట్‌లా ఉంటుందని చెప్పుకొచ్చారు. విజయ్ బర్త్ డే (జూన్ 22) సందర్భంగా నిన్న ఆయన 65వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీస్ట్ అంటూ వదిలిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా జానీ మాస్టర్ దళపతి విజయ్‌కు విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే విజయ్ సర్.. మీతో కలిసి పని చేస్తున్నందుకు నేను ఎంతో లక్కీ. ఇంకా మీతో మరెన్నో చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు. ఇక నిన్న దర్శకుడు నెల్సన్ బర్త్ డే సందర్బంగా జానీ మాస్టర్ స్పెషల్ పోస్ట్ చేశారు. దర్శకుడితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. నెల్సన్ దిలీప్ కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. బీస్ట్ ద్వారా దళపతి విజయ్ విశ్వరూపాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాం.. ఈ చిత్రంలో నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zMsofi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...