Tuesday, 22 June 2021

ఆరో నెల అంటూ అసలు విషయం చెప్పిన కియారా.. ఎన్నో జ్ఞాపకాలంటూ హీరో క్రేజీ రియాక్షన్! ఇష్యూ వైరల్

ప్రతి వ్యక్తి జీవితంలో సెంటిమెంట్లకు ఎంతో కొంత స్పేస్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో నటీనటులతో పాటు చాలామంది దర్శకనిర్మాతలు సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. కాంబినేషన్స్, రిలీజ్ డేట్స్ ఇలా చాలా విషయాల్లో సెంటిమెంట్ ఫాలో అవుతూ ఇండస్ట్రీ హిట్స్ రాబడుతుండటం చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి ఓ విషయాన్ని బయటపెడుతూ ఓపెన్ అయింది బాలీవుడ్ బ్యూటీ . ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న కియారా అద్వానీ.. రీసెంట్‌గా అభిమానులతో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. ఈ మేరకు తనకు సెంటిమెంట్ మంత్ గురించి వెల్లడించింది. ఆరో నెల అంటే తనకు సెంటిమెంట్ అని చెప్పేసింది. అందుకు కారణాన్ని కూడా బయటపెట్టి ఇష్యూ హాట్ టాపిక్ చేసేసింది కియారా. తెలుగులో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను '' పేరుతో హిందీలో రిలీజ్ చేశారు. ఇందులో , కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించారు. 2019 సంవత్సరం జూన్ 21న ఈ మూవీ విడుదలై సక్సెస్ కావడంతో పాటు హీరోహీరోయిన్లకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కియారా స్పందించింది. జూన్ నెల తన లక్కీ నెల అని, క్యాలెండర్‌లో ఆరో నెల తనకు బాగా కలిసి వస్తుందని చెప్పింది. అలాగే ఆ సినిమాతో ముడిపడి ఉన్న మధురానుభూతులను నెమరు వేసుకుంది. మరోవైపు 'కబీర్ సింగ్' రెండేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు రియాక్ట్ అయ్యారు. మనస్సుతో నేను.. హృదయంతో మీరు.. ప్రేమను జోడించడం ఓ మధురానుభూతి అని ఆయన తెలపగా.. హీరో షాహిద్ కపూర్ స్పందిస్తూ ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే ఎన్నో గుర్తులు, జ్ఞాపకాలంటూ క్రేజీగా పోస్ట్ పెట్టారు. ఇలా రెండేళ్ల తర్వాత కూడా 'కబీర్ సింగ్' మ్యాటర్ వార్తల్లో నిలిచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gV1Uzy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...