Saturday, 5 June 2021

మొక్కలు నాటి అభిమానులకు ఆఫర్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మీరు కూడా అదే చేశారంటే!!

నేడు (జూన్ 5) సందర్భంగా ఐకాన్ స్టార్ మొక్కలు నాటారు. సామాజిక బాధ్యత పరంగా ఎప్పుడూ ముందే ఉండే ఆయన.. మొక్కలు నాటి వాటి పర్యావరణం అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. తన అభిమానులను కూడా మొక్కలు నాటాలని కోరుతూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు బన్నీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఇది తన హార్ట్‌కు చాలా దగ్గరగా ఉందని, పర్యావరణం అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా అందరూ మొక్కలు నాటాలని.. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత'' అని అన్నారు. అంతేకాదు అందరం మొక్కలు నాటాలనే ప్రతిజ్ఞ చేయాలని, ఎకో ఫ్రెండ్లీగా ఉండే అలవాట్లు అలవర్చుకోవాలని కోరారు. ప్రకృతి మనకు అందించిన ఈ వరాన్ని జాగ్రత్తగా కాపాడుకొని వచ్చే తరానికి మరింత పచ్చదనం ఇవ్వాలని అన్నారు. అంతా మొక్కలు నాటాలని #GoGreenWithAA అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్యాగ్ చేస్తే వాళ్లందరి వీడియోలు కూడా తాను సోషల్ మీడియాలో రీ పోస్ట్ చేస్తానని తెలిపారు అల్లు అర్జున్. ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం 'పుష్ప' మూవీ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34ShrdD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...