Saturday, 5 June 2021

పవన్ కళ్యాణ్‌ని ఫాలో అవుతున్న బాలయ్య బాబు.. సరిగ్గా అదే స్ట్రాటజీ! ఇక అభిమానులకు పండగే

స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే ఫ్యాన్స్‌కి పండగే. ఆ రోజు వచ్చే సర్ప్రైజింగ్ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి అభిమాన వర్గాలు. మరి బాలయ్య బాబు లాంటి మాస్ హీరో పుట్టిన రోజంటే, అభిమానుల సందడి మాటల్లో చెప్పగలమా!. కానీ కరోనా కారణంగా ఆ స్థాయి సంబరాలు ఇప్పుడు లేనట్టే. సో.. ప్రతి ఏటా తన పుట్టిన రోజుని ఘనంగా నిర్వహించే అభిమానులకు, ఈ సారి బాలయ్య రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. తన పుట్టిన రోజైన ఈ నెల 10వ తేదీన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తన మూడు సినిమాలు అప్డేట్‌లు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లోని 'అఖండ' సినిమా టీజర్, యూట్యూబ్ రికార్డులని తిరగరాస్తోంది. విడుదలై వారాలు దాటిపోతున్నా రోజురోజుకి పెరిగిపోతున్న వ్యూస్‌‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకి తగ్గకుండా, ఈ సారి ఓ పవర్‌‌ఫుల్ లుక్ రిలీజ్ చేయబోతున్నారని టాక్ మొదలైంది. ఇక ఇటీవల 'క్రాక్' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తూనే ఉంది. ఆ టాక్‌ని అధికారికంగా అదే రోజున బయటపెడుతూ ఏ పోస్టర్ వదిలేలా సన్నాహాలు స్టార్ట్ చేశారట. మాస్ సినిమాలు తెరకెక్కించడంలో తన స్థాయి నిరూపించుకున్న గోపీచంద్‌పై బాలయ్య అభిమానులు గట్టి ఆశలే పెట్టుకున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌ని బోయపాటి, గోపీచంద్ మలినేనిలు ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తారో అందరికీ ఒక ఊహ ఉండొచ్చు. కానీ ఊహకి కూడా అందని మరో కాంబినేషన్ బాలయ్య-అనిల్ రావిపూడిది. ఎంటర్టైన్మెంట్కే పెద్ద పీట వేసే అనిల్, ఊర మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్యని ఎలా చూపించబోతున్నాడా అనేదే అంతటా ఆసక్తి. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఈ నెల 10న, అనగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వెలువడనుందని టాక్. పుట్టినరోజున మూడు నాలుగు సినిమాల అప్డేట్‌లతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే సాంప్రదాయం గతేడాది పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. అదే ఆనవాయితీని ఇప్పుడు బాలయ్య కొనసాగించబోతున్నారని చెప్పుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34RxVmw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...