Saturday, 5 June 2021

మళ్లీ పెళ్లి చేసుకోబోతోన్నాడా?.. నోయల్ పోస్ట్‌పై నెటిజన్ల అనుమానాలు!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి టాపిక్ వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా చేసిన ఓ పోస్ట్ ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. మామూలుగానే నోయల్ చుట్టూ ఎక్కువగా కాంట్రవర్సీలు అల్లుకుని ఉంటాయి. బిగ్ బాస్ కంటే ముందు.. మొదటి పెళ్లి బ్రేకప్, ఏస్తర్‌తో విడిపోవడం వంటివి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక బిగ్ బాస్ షోలో నోయల్ చుట్టూ బాగానే వివాదాలు అల్లుకున్నాయి. తాజాగా నోయల్ చేసిన ఓ పోస్ట్ అందరినీ జుట్టుపీక్కునేలా చేస్తోంది. నోయల్ ప్రేమ, పెళ్లి, విడాకుల సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ ఎస్తర్‌తో ప్రేమలో పడ్డ నోయల్ ఆమెను వివాహాం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ వేరు పడ్డారు. కానీ అధికారికంగా మాత్రం గత ఏడాది విడిపోయారు. కోర్టు ఉత్తర్వులు రావడంతో ఈ ఇద్దరూ కూడా తమ విడాకుల విషయాన్ని బహిర్గత పరిచారు. దీంతో ఒక్కసారిగా నోయల్, ఏస్తర్‌లు హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఆ విషయం బయట కాంట్రవర్సీ అవుతున్న సమయానికే నోయల్ బిగ్ బాస్ షో కోసం క్వారంటైన్‌లో ఉన్నారు. అలా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన నోయల్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. సినిమాల్లో చూసిన నోయల్‌కు బిగ్ బాస్ నోయల్‌కు ఎంతో తేడా ఉందని ప్రేక్షకులు కామెంట్లు చేశారు. బిగ్ బాస్ ఇంట్లో నోయల్ తన ఫ్యామిలీ గురించి చెప్పిన మాటలు, బయటకు వస్తూ అమ్మ రాజశేఖర్, అవినాష్‌ల మీద చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మంచి వాడిగా ఇమేజ్ తెచ్చుకున్న నోయల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. తాజాగా నోయల్ ఓ పోస్ట్ చేశారు. అందులో ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటా? అని అందరూ కామెంట్లుపెడుతున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోబోతోన్నావా? అని అందరూ ఒకే ప్రశ్నను సంధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం అది సినిమా అప్డేట్ అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో? నోయల్ ఆ విషయం ఎప్పుడు చెబుతాడో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vTLPjK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...