Tuesday, 15 June 2021

సినీ నటి బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. అర్ధరాత్రి వేళ పోలీసుల ఎటాక్.. అతనితో పాటు బుక్కైన యాక్ట్రెస్

సినీ నటులు డ్రగ్స్ వాడుతారనే టాక్ ఎప్పటినుంచో ఉంది. ఇంజక్షన్, పౌడర్ లాంటి రూపాల్లో సేవిస్తారని వాటిని సేవించి మత్తులో ఊగిపోతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ అనే అంశం పలుమార్లు సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పటికీ చాలా మంది నటీనటులు డ్రగ్స్ వాడుతున్నారనే నెపంతో విచారణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ నటిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. తన బర్త్ డే పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగించారనే ఆరోపణలో ఆమెను అరెస్ట్ చేశారు. ముంబై నగరం జుహులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బాలీవుడ్‌ యువ నటి తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ వేడుకలో డ్రగ్స్ వాడుతున్నారని సీక్రెట్ ఇన్ఫర్మషన్ రావడంతో అర్ధరాత్రి వేళ పోలీసులు ఎటాక్ చేశారు. నార్కోటిక్ డిపార్టెమెంట్‌కు చెందిన పోలీసులు చేసిన ఈ రైడ్‌లో నటి నైరా నేహాల్‌ షాతో పాటు ఆమె స్నేహితుడు అశిక్‌ సాజిద్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందని, పార్టీ నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా అరెస్టు అనంతరం నైనా, ఆమె స్నేహితుడు అశిక్‌ని కోర్టులో హాజరు పర్చగా వీళ్లకు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌తో పాటు పలు తెలుగు చిత్రాల్లో కూడా నైరా నేహాల్‌ షా నటించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35krDvM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...