Tuesday, 15 June 2021

ఆరుబయటే బురద నీటి స్నానం.. చాలా రిలాక్స్ అంటూ అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్ రచ్చ

ఈ మధ్యకాలంలో హీరోయిన్లకు అర్ధ నగ్నంగా పోజులివ్వడం ఫ్యాషన్ అయిపోయింది. తమ లేలేత అందాలను ఆరబోస్తూ కెమెరా ముందుకొచ్చి ఆ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నేటితరం ముద్దుగుమ్మలు. ఎంత హాట్‌గా కనిపిస్తే అంత ఫాలోయింగ్ పెరుగుతుంది అన్నట్లుగా ఉంది నేటి హీరోయిన్ల తీరు. ముఖ్యంగా బాలీవుడ్ భామలైతే రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హాట్ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. తన అందాలతో కుర్రకారులో హీటు పుట్టించడం ఊర్వశికి కొత్తేమీ కాదు. వీలు చిక్కినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ ఫొటోస్ వదులుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె తన అర్ధనగ్న ఫొటో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది. ఆరుబయటే బురద నీటి స్నానం చేస్తూ కెమెరాకు పోజిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫొటోలో ఆమె నిండా రేగడి బురదనే కనిపిస్తోంది. అయితే ఈ హాట్ ఫొటో షేర్ చేస్తూ అంతకంటే హాట్‌గా.. ఈ రేగడి బురద నీటి స్నానంతో చాలా రిలాక్స్ అవుతామంటూ కామెంట్ పోస్ట్ చేసింది ఊర్వశి. అంతేకాదు నాకెంతో ఇష్టమైన మడ్ బాత్ ఇది అని ఆమె పేర్కొంది. తరచుగా ఇలాంటి స్నానం చేస్తుండటం వల్ల శరీరానికే కాదు.. మనసుకు, మైండ్‌కు చాలా రిలాక్స్‌గా అనిపిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఇదే నా మడ్ బాత్/ మడ్ థెరపీ అంటూ కాప్షన్ పెట్టింది. ఊర్వశిని ఇలా చూసి షాకవుతున్నారు నెటిజన్లు. 'సింగ్ సాబ్ ది గ్రేట్' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఊర్వశి రౌతేలా.. 'సనమ్‌రే' అనే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 4' నటించి కుర్రకారును ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో బ్లాక్ రోజ్ అనే సినిమాతో పాటు మరో వెబ్ సిరీస్ ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pVKI0S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...