Saturday, 26 June 2021

ఏడు రోజులు.. ఆరు రాత్రులు!! గ్యాప్ తరువాత మళ్లీ మొదలు.. ఇదేదో తేడాగా ఉందే!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యుసర్‌గా విజయవంతమైన చిత్రాలను నిర్మించిన .. లాంగ్ గ్యాప్ తరువాత ‘డర్టీ హరి’ చిత్రానికి దర్శకత్వం వహించి సక్సెస్ అయ్యారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈయన గేర్ మార్చి యూత్‌ని అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. ‘డర్టీ హరి’ చిత్రాన్ని బోల్డ్‌గా తీసిన ఎంఎస్ రాజు.. అదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ఎంఎస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజు పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర ప్రీలుక్ విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. విహార యాత్రకు వెళ్లిన ఓ జంట.. ఏడు రోజుల్లో.. ఆరు రోజుల్లో ఏం చేశారన్నదే ఈ సినిమా కథాశం కాగా.. ప్రీ లుక్ పోస్టర్‌ కూడా కాన్సెప్ట్ బేస్డ్‌గానే ఉంది. ‘’ అనే టైటిల్‌తో పాటు బీచ్.. ఒడ్డున బోట్‌లు.. ఇవన్నీ చూస్తే ఈ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ మాదిరే ఉంది. అయితే జూన్ 7 ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. అయితే తిరిగి ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో‘7 Days 6 Nights’ షూటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో గొల్లపూడి సమర్థ్ అనేయంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jgN2OH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...