గ్యాప్ తీసుకుని జబర్దస్త్‌కి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత జడ్జీ పంచ్‌లకు మరింత పదును పెట్టారు. గత ఎనిమిదేళ్లుగా జబర్దస్త్‌కి ఎంతో మంది కమెడియన్లు.. టీం లీడర్లు వచ్చారు.. వెళ్లారు కానీ రోజా మాత్రం ఆ సీట్లో ఫిక్స్ అయిపోయారు. దీంతో పంచ్‌లు పేల్చడంతో ఈ జడ్జీ అనిపిస్తుంది. తాజాగా వచ్చేవారానికి సంబంధించి విడుదల చేయగా.. రోజా పంచ్‌లతో రెచ్చిపోయారు. హైపర్ ఆది లుంగీ కట్టుకుని.. రీతు చౌదరితో స్టెప్పులు వేస్తూ కనిపించాడు. మధ్యలో పనివాడి క్యారెక్టర్‌లో ఉన్నవాడు రీతు చౌదరి చేయి పట్టుకుని డాన్స్ చేయడంతో.. ఆది అతన్ని కొడుతూ పక్కకి నెట్టేశాడు. అయితే రోజా.. ‘ఆయన సందులో చించు’ అంటూ పంచ్ వేశారు. ఇక రీతూ చౌదరి ఆదితో.. ఏమండీ!! నా కడుపు పండేలా చూడండి అని అనడంతో.. ‘గోరింటాకు పెట్టండి’ అని అదిరిపోయే పంచ్ వేశారు రోజా. నేను చెప్పాల్సిన డైలాగ్ నా కంటే ముందే రోజాగారు చెప్పేస్తున్నారు.. చూశావా? అన్నట్టుగా ఆది అదిగో చూడు అంటూ రోజాని చూపించి తెగ నవ్వుకున్నారు. ఎందుకండీ.. మీలో ఏమైనా లోపం ఉందా? అని రీతూ చౌదరి.. ఆదిని అడగడంతో అతను నోటికి పనిచెప్పాడు. ‘ఏదైనా చేస్తేనేమో స్కిట్‌కి పిలిచి ఇలా చేస్తారా? అంటారు.. ఏమీ చేయకపోతేనేమో లోపం అంటారు.. ఏం చేయాలి’ అని ఆది డబుల్ మీనింగ్ డైలాగ్ వేయడంతో ‘అంటే చేశావ్ అన్నమాట’.. అని అనసూయ అందుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U4ON70
v
No comments:
Post a Comment