Saturday, 26 June 2021

పవన్ లేని తెలుగు సినిమా పవర్ లేని ఇండియా అట!! కాస్త కాదు బాగా ఎక్కువైదంటూ సెటైర్లు

పవన్ భక్తుడు బండ్లగణేష్ సమయం వచ్చిన ప్రతిసారి తన భక్తిని చూపిస్తూనే ఉంటుంటారు. దాన్ని అభిమానం అని కొందరంటే భజన అనే వాళ్లు చాలామందే ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని కామెంట్లు చేసినా.. దారుణంగా ట్రోల్ చేసినా మాత్రం వెనక్కి తగ్గరు. మైనేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ ఈజ్ అని తన ఫ్లోలో తాను వెళ్లిపోతూనే ఉంటారు. అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌పై భక్తి చూపించిన ప్రతిసారీ కూడా బండ్లను ట్రెండింగ్‌లో ఉంచుతుంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అంతేకాదు.. బండ్ల గణేష్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. నువ్ కుమ్మెయ్ బండ్లన్నా అని అండగా నిలుస్తుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ స్పీచ్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బల్లగుద్ది చెప్తున్నా.. నేను మీ భక్తుడ్ని సామీ’ అంటూ బండ్ల గణేష్ చేసిన ప్రసంగం.. పవన్ అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. గొప్ప గొప్ప స్క్రిప్ట్ రైటర్లు కలాలు సైతం వణికేలా ఊపేశాడు బండ్ల గణేష్. అతను మాట్లాడిన ఒక్కోమాటా యూట్యూబ్‌లో తూటాలా పేలింది. దెబ్బకి బండ్ల గణేష్ ట్రెండింగ్ నెంబర్ 1లో నిలిచారు. ఇదిలా ఉంటే తాజా బండ్ల గణేష్ మరోసారి పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ షేర్ చేసి ట్వీట్ వామ్మో అనేట్టుగానే ఉంది. ‘పవర్ లేకపోతే భారతదేశం ఎలా ఉంటుందో.. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగు సినిమా కూడా అలానే ఉంటుంది’ అనే కొటేషన్‌తో బండ్ల గణేష్ మాదిరిగానే ఉన్న మరో పవన్ భక్తుడు ఓ వీడియోను షేర్ చేశాడు. అయితే ఈ వీడియో బండ్ల గణేష్ రీట్వీట్ చేసి తన అభిమానాన్ని మరోసారి చూపించారు. అయితే పవన్ కళ్యాణ్‌ని మరీ పవర్ లేని ఇండియాతో పోల్చడం కాస్త కాదు మరీ ఎక్కువైందని కొంతమంది సెటైర్లు వేస్తుంటే.. పవన్ అభిమానులు మాత్రం లైక్‌లు రీట్వీట్ల మోత మోగిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xbxekc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...