Friday, 25 June 2021

మెగా పవర్ స్టార్ కోసం పాదయాత్ర.. ఫ్యాన్స్ కోసం కదిలివచ్చిన రామ్ చరణ్

అభిమానులు చూపించే ప్రేమకు హద్దులుండవు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను చాటుతుంటారు. తమ అభిమాన హీరోపై ఉన్న అంతులేని ఇష్టాన్ని అభిమానులు పలు రకాలుగా చూపుతుంటారు. పచ్చబొట్టు పొడిపించుకోవడం, వారి యోగక్షేమాల కోసం పూజలు చేయడం, బర్త్ డే సందర్బంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఇక కొందరు తమ హీరోను చూసేందుకు ఏకంగా పాదయాత్ర చేస్తుంటారు. మొన్నీమధ్యే సోనూ సూద్ కోసం ఏకంగా హైద్రాబాద్ నుంచి ముంబైకి వెళ్లాడో అభిమాని. అంతకు ముందు ఓ అభిమాని అల్లు అర్జున్ కోసం కాలినడకన వచ్చేశారు. అలా తన మీద అంతులేని అభిమానాన్ని చూపించిన ఫ్యాన్‌ను బన్నీ ఆత్మీయంగా పలకరించారు. కానీ ఇలాంటి చర్యలు ఇంకోసారి ఎవ్వరూ కూడా చేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మెగా పవర్ స్టార్ కోసం అభిమానులు పాదయాత్రను చేశారు. కాలినడకన వచ్చి చివరకు తాము అనుకున్నది సాధించేశారు. సంధ్య జయరాజ్, రవి, వీరేష్‌లు జోగులాంబ గద్వాల్ నుంచి హైద్రాబాద్ వరకు దాదాపు 231 కి.మీ పాదయాత్ర చేశారు. నాలుగు రోజులు కష్టపడి తమ అభిమాన తారను కలుసుకున్నారు. తన కోసం ఇంతలా కష్టపడి వచ్చిన అభిమానులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు రామ్ చరణ్. ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చట్లు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మొన్నీ మధ్యే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qnYeL1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...