Friday, 25 June 2021

Radhe Shyam : ‘రాధేశ్యామ్’ షూటింగ్ ప్రారంభం.. అడుగుపెట్టేసిన పూజా హెగ్డే

ప్రస్తుతం కరోనా పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు విధించినా సడలింపులు ఇచ్చారు. ఇంకొన్ని రాష్ట్రాలు లాక్డౌన్‌ను ఎత్తేశాయి. అలా తెలంగాణలో ఇప్పుడు ఎటువంటి నిబంధనలు లేవు. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో షూటింగ్‌ల జాతర మొదలైంది. మూలన పడ్డ అన్ని సినిమాలు ఒక్కొక్కటిగా వరుసకట్టి సెట్స్ మీదకు వస్తున్నాయి. అయితే తాజాగా సినిమా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అసలే ఈ మూవీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడింది. ఇక కరోనా ఉధృతి ఉన్నా కూడా గత ఏడాది ఇటలీలో కొంత పార్ట్ షూటింగ్‌ను చేసుకుంది. ఇక అన్నపూర్ణ స్టూడియోలోనే ఇటలీ రైల్వే స్టేషన్‌ను నిర్మించేశారు. ఆ సెట్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా చేసిన పోస్ట్‌తో రాధేశ్యామ్ అప్డేట్ వచ్చేసింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల గ్యాప్ రాగా.. ఇప్పుడు యూనిట్ మొత్తం సెట్స్ మీదకు వచ్చేసింది. ఈ క్రమంలో నేటి ఉదయమే పూజా హెగ్డే రాధేశ్యామ్ కోసం రెడీ అయ్యారు. ఈక్రమంలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పని చేసేందుకు సమయం ఆసన్నమైంది అంటూ రాధేశ్యామ్ సెట్‌లోకి అడుగుపెడుతున్నట్టు పూజా హెగ్డే తెలిపారు. ఈ సందర్భంగా తన పాత్రకు తగ్గట్టుగా మేకప్ వేస్తున్న అసిస్టెంట్ల గురించి కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ మూవీ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jkBauS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...