ఒకప్పటిలా లేవు రోజులు.. తెలుగు సినిమాలపై బాలీవుడ్ స్టార్స్ దృష్టి పడింది. బీ టౌన్ స్టార్ హీరో హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో నటించడమే గాక.. ఇక్కడి సినిమాలను రీమేక్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా అదే బాటలో వెళ్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో . ఇప్పటికే రాజమౌళి రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా RRRలో భాగమవుతున్న ఆయన, మరో తెలుగు సినిమా రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తాజాగా అజయ్ దేవగణ్- దిల్ రాజు కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చింది. అల్లరి నరేష్ నటించిన కోర్ట్ డ్రామా 'నాంది' మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కి నరేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించిన నాంది సినిమా తెలుగులో సూపర్ సక్సెస్ అందుకోవడమే గాక విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసే బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై పరాగ్ దేశాయ్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్‌తో కలిసి అజయ్ దేవగణ్ ఈ సినిమాను నిర్మించబోతుండటం విశేషం. పరిపాలనలోని లొసుగులని తెలియజేసే చిత్రంగా 'నాంది' కథ తన మనసుకు తాకడంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు చేతులు కలిపానని అజయ్ దేవగణ్ తెలిపారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాపై బీ టౌన్ ఆడియన్స్ దృష్టి పడింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vV24ME
v
No comments:
Post a Comment