Saturday, 5 June 2021

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ్.. 'మిర్చి' భామకు మాటల్లో చెప్పలేని ఆనందం

ఒకానొక సమయంలో తెలుగు తెరను షేక్ చేసింది హీరోయిన్ . తనదైన నటనతో పాటు గ్లామర్ టచ్ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్ అయింది. 2010 సంవత్సరంలో 'లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ''నాగవల్లి, మిరపకాయ్'' సినిమాల్లో నటించింది. ఇక 2013లో ప్రభాస్ సరసన 'మిర్చి' సినిమాలో నటించి ఫుల్ పాపులర్ అయింది. అయితే ఆ తర్వాత తన స్నేహితుడిని పెళ్లాడిన ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేస్తున్న రిచా గంగోపాధ్యాయ్ తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మే 27వ తేదీన తనకు మగబిడ్డ పుట్టాడని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది రిచా. బాబుకి ‘లుకా షాన్‌’ అనే పేరు పెట్టామని పేర్కొంది. ''మా చిరు సంతోషం లుకా షాన్‌. చిన్నారి రాక మా కుటుంబంలో సంతోషం నింపింది. లుకా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. రూపురేఖల్లో అచ్చం తన నాన్నలాగానే ఉన్నాడు. లుకా.. నువ్వు మా జీవితాల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు'' అని రిచా తన పోస్టులో రాసుకొచ్చింది. సినిమాల్లో నటిస్తూనే ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లిన రిచా.. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జో లాంగేల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నటనకు దూరమై వైవాహిక జీవితం గడుపుతోంది. ఇప్పుడు ఆమె తల్లయిందని తెలిసి నెటిజన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RniejE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...