Saturday, 5 June 2021

The Family Man- 2 : చాలా భయమేసిందంటూ తొలిసారి నోరువిప్పిన అక్కినేని కోడలు.. సమంత రియాక్షన్ చూస్తే!!

వెబ్ సిరీస్‌తో అక్కినేని ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ ఆపేయాలంటూ తమిళుల నుంచి డిమాండ్స్ వచ్చినా ఎట్టకేలకు అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తన పాత్ర గురించి ఇప్పటిదాకా మౌనం పాటించిన సామ్.. తాజాగా నోరు విప్పింది. రాజ్‌ అండ్‌ డీకే రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌లో రాజ్యలక్ష్మి అలియాస్‌ రాజీ పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రియాక్ట్ అయిన సమంత.. రాజీ రోల్ తనకెంతో స్పెషల్‌ అని చెప్పింది. ఇప్పుడు ఫ్యామిలీ మేన్‌-2 వెబ్ సిరీస్‌కు వస్తున్న రిస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్‌లో రాజీ రోల్ నాకు ఆఫర్ చేసినపుడు ఈ పాత్ర చేయడానికి సెన్సిటివిటీ, బ్యాలెన్స్ ఎంతో అవసరమనుకున్నాను. ఈ మూవీలో భాగమయ్యే ముందు.. ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు, మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసే కొన్ని డాక్యూమెంటరీలను చూసి చాలా భయపడ్డానని సమంత తెలిపింది. ఆ సమయంలో వాళ్ళు పడిన కష్టాలు, కన్నీటి గాథలను చూసి గుండె తరుక్కుపోయింది సామ్ చెప్పింది. ఈ యుద్ధంలో ఎంతో ప్రాణ నష్టం జరిగినప్పటికీ ప్రపంచం వాళ్ల వైపు కూడా చూడలేదు. రాజీ కథ, కల్పితమైనప్పటికీ, అసమాన యుద్ధం కారణంగా మరణించిన వారికి, ఆ బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవిస్తున్న వారికి ఇది ఒక నివాళి అని సమంత పేర్కొంది. రాజీ కథ మనకు ఎంతో అవసరమని, ఈ పాత్ర ఒక రోల్ మోడల్ లాంటిదని చెప్పింది. ద్వేషం, అణచివేత లాంటి పరిణామాలపై పోరాడటానికి మనుషులుగా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను అని సమంత తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pnHdzT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...