Monday, 7 June 2021

ఈ ప్రపంచంలో అతనొక్కడే.. నాలో అలాంటి ఫీలింగ్స్! రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అనే సంగతి మనందరికీ తెలుసు. పవన్‌తో విడాకుల అనంతరం తన కొడుకు అకీరా, కూతురు ఆధ్య బాధ్యతలను భుజాలపై వేసుకున్న ఆమె ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరి విశేషాలతో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న అంశాలపై స్పందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గురించి రేణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో అకీరాకు సంబంధించిన ప్రతి వార్త చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన సినీ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అకీరా సినిమా ఎంట్రీ గురించి రేణుని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే ఇది అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని రేణు చెప్పడంతో.. పవన్ వారసుడిగా అకీరాను వెండితెరపై చూడబోతున్నామని అంతా ఫిక్సయ్యారు. ఈ పరిస్థితుల నడుమ అకీరా గురించి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన కొడుకుతో దిగిన పిక్ షేర్ చేసిన రేణు.. ''ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగల ఒకే ఒక్కడు అకీరా. అతను వేసే జోకులు వింటుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. నా జోకులే నన్ను నవ్విస్తున్నట్లు ఉంటుంది'' అని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాలో పోస్ట్ పెట్టింది. కాగా ఆద్య, అకీరా నందన్‌ల గురించి, వారి అలవాట్లు, అల్లరి గురించి గతంలో స్పందించిన రేణు దేశాయ్.. అకీరా ఎంత సైలెంట్‌గా ఉంటాడో, ఆద్య అంతగా అల్లరి చేస్తుంటుందని చెప్పింది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో అకీరా బాగా ఫోకస్ అవుతుండటం చూస్తుంటే త్వరలోనే ఆయన సినీ ఎంట్రీ ఖాయం అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fZLy9v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...