Monday, 7 June 2021

అమితాబ్ బచ్చన్‌తో రామ్ గోపాల్ వర్మ నయా స్కెచ్! బిగ్ బీని మెప్పించి మరీ అలా..

రూటే సపరేటు.. ఇది దేశం మొత్తం తెలిసిన మాట. అందరు దర్శకులు ఒకలా ఆలోచిస్తే అందుకు భిన్నంగా ఆలోచించడం వర్మ నైజం. ఎవరేమనుకుంటే నాకేంటి నాకు నచ్చింది నేను చేస్తా అంటూ దూసుకుపోతున్నారు ఈ వివాదాస్పద డైరెక్టర్. ముఖ్యంగా లాక్‌డౌన్ వేళ వర్మ తనదైన ప్రత్యేకమైన దారిలో వెళుతూ సిచుయేషన్ క్యాష్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వరుస సినిమాలను ప్రకటిస్తున్న ఆయన, ఇప్పుడు బాలీవుడ్ బడా స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పర్ఫెక్ట్ స్కెచ్చేశారని తెలుస్తోంది. గతంలో అమితాబ్ బచ్చన్- రామ్ గోపాల్ వర్మ కాంబోలో 'సర్కార్‌' మూవీ వచ్చింది. 2005 సంవత్సరంలో పొలిటికల్‌ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించగా అభిషేక్ బచ్చన్, కోట శ్రీనివాసరావు, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించి అలరించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా 2008లో 'సర్కార్ రాజ్‌', 2017లో 'సర్కార్‌ 3' విడుదలై సక్సెస్ అందుకున్నాయి. అయితే ఇన్నేళ్లకు మళ్ళీ అమితాబ్‌తో సినిమా చేయాలని ఫిక్సయ్యారట రామ్ గోపాల్ వర్మ. గత కొన్నేళ్లుగా ఈ సినిమా కోసం సీక్రెట్‌గా స్క్రిప్ట్ రెడీ చేసిన ఆయన.. రీసెంట్‌గా ఈ కథను బిగ్ బీకి వినిపించి మెప్పించారట. వర్మ కథ విన్న అమితాబ్ వెంటనే ఓకే చెప్పారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈ మూవీ కోసం అంతా పక్కాగా ప్లాన్ చేసే పనిలో పడ్డారట రామ్ గోపాల్ వర్మ. అతి త్వరలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువచ్చేలా డేట్స్ ఫైనల్ చేస్తున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RxRCN6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...